![]() |
![]() |

`జోష్` (2009)తో అక్కినేని మూడో తరం కథానాయకుడు నాగచైతన్యని తెలుగు తెరకు పరిచయం చేశారు స్టార్ ప్రొడ్యూసర్ `దిల్` రాజు. కట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంతరం మళ్ళీ ఇప్పుడు చైతూతో `థాంక్ యూ` నిర్మించారు. విక్రమ్ కె. కుమార్ రూపొందించిన ఈ రొమాంటిక్ డ్రామాలో నాగచైతన్యకి జంటగా రాశీ ఖన్నా, అవికా గోర్, మాళవికా నాయర్ నటించగా.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ బాణీలు అందించాడు. ఏస్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఛాయాగ్రహణం అందించిన ఈ సినిమా.. జూలై 22న జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. గతంలో ఇదే జూలై ద్వితీయార్ధంలో రాజు నిర్మించిన `ఫిదా` విడుదలైంది. వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తీర్చిదిద్దిన సదరు రొమాంటిక్ డ్రామా.. 2017 జూలై 21న విడుదలై సంచలనం సృష్టించింది. మరి.. `ఫిదా`లాగే జూలై సెకండాఫ్ లోనే రాబోతున్న `థాంక్ యూ` కూడా విజయపథంలో పయనించి.. రాజుకి మరో మెమరబుల్ హిట్ ని అందిస్తుందేమో చూడాలి. అలాగే, శేఖర్ కమ్ముల లాగే విక్రమ్ కుమార్ కూడా సక్సెస్ ట్రాక్ లోకి వస్తారా? అన్నది కూడా ఆసక్తికరమే!
![]() |
![]() |