![]() |
![]() |

సినీ నటుడు ప్రకాష్ రాజ్ ఇటీవల గాయపడిన సంగతి తెలిసిందే. చెన్నైలో ఓ తమిళ షూటింగ్ లో పాల్గొన్న ఆయన సెట్ లో గాయపడ్డారు. తన చేతికి చిన్న ఫ్రాక్చర్ అయిందని, హైదరాబాద్లోని తన స్నేహితుడు డాక్టర్ గురువారెడ్డితో సర్జరీ చేయించుకునేందుకు వస్తున్నానని ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. ఇక తాజాగా ట్విట్టర్ వేదికగా ఆయన తన ఆరోగ్య పరిస్థితిని తెలియజేశారు.
"ది డెవిల్ ఈజ్ బ్యాక్" అంటూ హాస్పిటల్ బెడ్ పై నుంచి సెల్ఫీ తీసుకున్న ఫోటోను ప్రకాష్ రాజ్ ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలో ఆయన ఎడమ చేతి భుజంపై గాయమైనట్టుగా కనిపిస్తుంది. సర్జరీ విజయవంతమయిందని ట్వీట్ లో చెప్పిన ప్రకాష్ రాజ్.. తనకు సర్జరీ చేసిన డాక్టర్ గురువారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే, తాను కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని.. త్వరలోనే మళ్లీ షూటింగ్లలో పాల్గొంటానని పేర్కొన్నారు.
ప్రకాష్ రాజ్ ప్రస్తుతం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతోన్న 'రంగమార్తాండ' సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అలాగే తెలుగు, తమిళ్ లో పలు చిత్రాల్లో నటిస్తున్నారు.
![]() |
![]() |