![]() |
![]() |

'ప్రేమపావురాలు' (మైనే ప్యార్ కియా) మూవీతో తెలుగు ప్రేక్షకుల కలల రాణిగా మారింది భాగ్యశ్రీ. ఒరిజినల్ ఫిల్మ్‌తో హిందీ ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేసిన ఆమె, ఒక డబ్బింగ్ మూవీతో తెలుగువారి హృదయాల్లో స్థానం సంపాదించడం చిన్న విషయం కాదు. ఆ తర్వాత ఆమె 'యువరత్న రాణా' (1998)లో బాలకృష్ణ చెల్లెలిగా డైరెక్టుగా తెలుగు సినిమాలో నటించింది. హిమాలయ్ దస్సానీని వివాహం చేసుకొని, సినిమాలకు దూరమైన భాగ్యశ్రీ.. ఇన్నాళ్ల తర్వాత ప్రభాస్ మూవీ 'రాధేశ్యామ్'తో టాలీవుడ్‌కు తిరిగి వస్తోంది.
కాగా, భాగ్యశ్రీ కుమార్తె అవంతిక ఇప్పుడు టాలీవుడ్ సినిమా ద్వారా తెరంగేట్రం చేయనున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది. తన తొలి సినిమాలో ఆమె బెల్లంకొండ సురేశ్ చిన్నకుమారుడు గణేశ్ సరసన నాయికగా ఆమె నటించనున్నది. 'నాంది' మూవీతో దర్శకుడిగా ఆకట్టుకున్న విజయ్ కనకమేడల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. భారీ తారాగణంతో ఈ సినిమా రూపొందనున్నట్లు సమాచారం.
భాగ్యశ్రీ పోలికలు కొట్టొచ్చినట్లు కనిపించే అవంతిక టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తే, ఆమెకు భారీ పబ్లిసిటీ దక్కడం ఖాయం. త్వరలో ఈ సినిమా గురించిన మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.
![]() |
![]() |