![]() |
![]() |

సినిమా హీరోలపై పిచ్చి అభిమానం పెంచుకోవడం మంచిది కాదని ఎందరో ఎన్ని రకాలుగా చెప్పినా కొందరి తీరు మారడం లేదు. తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్ చేసిన ఓ పని సంచలనంగా మారింది. 'ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోవద్దు' అంటూ ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ కి ప్రభాస్ ఫ్యాన్ సూసైడ్ లెటర్ రాశాడు.
ప్రభాస్ ఫ్యాన్ పేరుతో రాసిన సూసైడ్ నోట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రభాస్ నటిస్తున్న మూవీ 'రాధే శ్యామ్' కి సంబంధించిన అప్డేట్స్ సరిగ్గా ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన ప్రభాస్ ఫ్యాన్ యావీ క్రియేషన్స్ కి సూసైడ్ లెటర్ రాసినట్లుగా ఆ నోట్ లో ఉంది. "ఇంతవరకూ ఒక్క లెటర్ కూడా రాయని నేను సూసైడ్ నోట్ రాస్తానని కలలో కూడా అనుకోలేదు. మీరు అప్డేట్స్ ఇవ్వకపోవడం వల్ల రాయక తప్పట్లేదు. కనీసం నా చావుని చూసైనా రాధే శ్యామ్ అప్డేట్ ఇస్తారని అనుకుంటున్నాను. చాలా వెయిట్ చేపించారు. మేం వెయిట్ చేశాం. ఇక చాలు సార్. నా చావుకి యూవీ క్రియేషన్స్, డైరెక్టర్ రాధాకృష్ణ కారణం. దయచేసి ఫ్యాన్స్ ఎమోషన్స్ తో ఆడుకోకండి" అంటూ రెబల్ స్టార్ ఫ్యాన్ సూసైడ్ నోట్ రాశాడు.

ప్రభాస్ ఫ్యాన్ పేరుతో వైరల్ అవుతున్న ఈ సూసైడ్ నోట్ ని ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొందరు తప్పబడుతున్నారు. సినిమా అప్డేట్ ఇవ్వకపోతే సూసైడ్ చేసుకుంటాను అనడం ఏంటని మండిపడుతున్నారు.
![]() |
![]() |