![]() |
![]() |

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'దృశ్యం 2' డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానుంది. వెంకటేష్ గత చిత్రం 'నారప్ప' కూడా ఓటీటీలోనే విడుదలైంది. అయితే 'దృశ్యం 2'ని ఆలస్యమైనా థియేటర్స్ లోనే విడుదల చేస్తారని ప్రచారం జరిగింది. కానీ 'దృశ్యం 2' మేకర్స్ చివరికి ఓటీటీకే ఓటేశారు. తాజాగా 'దృశ్యం 2'ను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'దృశ్యం' సిరీస్ కు మంచి క్రేజ్ ఉంది. 'దృశ్యం' మొదటి పార్టే మంచి విజయాన్ని అందుకుందంటే.. 'దృశ్యం 2' దాన్ని మించిన విజయాన్ని అందుకుంది. అంతేకాదు రీమేక్ అయిన అన్ని భాషల్లోనూ 'దృశ్యం' విజయం సాధించింది. తెలుగులో వెంకటేష్ 'దృశ్యం'తో హిట్ అందుకున్నాడు. ఇప్పుడు 'దృశ్యం 2'తో అలరించడానికి సిద్ధమయ్యాడు. దీనికి ఒరిజినల్ మూవీ డైరెక్ట్ చేసిన జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించడం విశేషం.

'నారప్ప' విడుదల సమయంలో వెంకటేష్ నెక్స్ట్ మూవీ 'దృశ్యం 2' కూడా డైరెక్ట్ ఓటీటీలో విడుదల కానుందని మొదటి ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆలస్యమైనా 'దృశ్యం 2'ని థియేటర్స్ లోనే విడుదల చేస్తారని వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు నేరుగా ఓటీటీలోనే విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. నవంబరు 25 నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో 'దృశ్యం 2' స్ట్రీమింగ్ కానుంది.
![]() |
![]() |