![]() |
![]() |

నేటి అగ్ర కథానాయకులలో వందకు పైగా చిత్రాల్లో నటించినది ఇద్దరే. చిరంజీవి 150 చిత్రాల మైలురాయి అందుకోగా, బాలకృష్ణ 100 చిత్రాల మైలురాయి దాటేశారు. శతాధిక చిత్రాల్లో బాలకృష్ణది అరుదైన ఘనత. ఆయన పౌరాణిక చిత్రాల్లో నటించారు. జానపద చిత్రాలు చేశారు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన చిత్రాల్లో నటించారు. ఈతరం ట్రెండ్‌కి తగిన సినిమాలు చేశారు. కథానాయకుడిగా ఆయన ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు చేశారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో అఘోరాగా నటిస్తున్నారు. నందమూరి నటసింహం చేయని పాత్ర లేదంటే అతిశయోక్తి లేదేమో. ఆయనకు కూడా డ్రీమ్ రోల్స్, ఒక ప్రాజెక్ట్ ఉంది.
ఇప్పటివరకూ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేసిన బాలకృష్ణ, తనకు చంఘీజ్‌ఖాన్, గోన గన్నారెడ్డి పాత్రలు చేయాలనుందని పుట్టినరోజు సందర్భంగా చెప్పారు. ‘ఆదిత్య 999’ ప్రాజెక్ట్ కూడా చేయాలనుందని తెలిపారు. నిజానికి, ‘ఆదిత్య 999’ను తన వందో సినిమాగా చేయాలనుకున్నారు. ఓ సందర్భంలో ప్రకటించారు కూడా! కానీ, ఎందుకో మెటీరియలైజ్ కాలేదు. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘ఆదిత్య 369’ ఘన విజయం సాధించడమే కాదు... నటుడిగా బాలకృష్ణకు ఎంతో పేరు తీసుకొచ్చింది.
![]() |
![]() |