![]() |
![]() |

“సీటీమార్ సీటీమార్ సీటీమార్ సీటీమార్ సీటీమార్.. యన్టీఆర్ ఏయన్నార్ మెగాస్టార్ నిన్నే చూస్తే విజిలే ఏస్తార్".. ‘డీజే’(దువ్వాడ జగన్నాథమ్) చిత్రంలోని ఈ పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూట్యూబ్ ముంగిట 160 మిలియన్లకి పైగా వ్యూస్‌తో ఇప్పటికీ కుర్రకారుని ఫిదా చేస్తుందీ గీతం. అలాంటి ఈ సెన్సేషన్ సాంగ్‌పై, అందులో నర్తించిన మెరుపు తీగ పూజా హెగ్డేపై బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కన్నేశాడు. ఫలితంగానే తన బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్‌లో ఈ సాంగ్‌కి, సాంగ్‌లో చిందేసిన పూజకి స్థానమిచ్చాడు.
ఆ వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ చేతిలో ‘రాధే’, ‘కభీ ఈద్ కభీ దివాలీ’ చిత్రాలున్నాయి. వీటిలో సౌత్ ఇండియన్ డైరెక్టర్ ప్రభుదేవా రూపొందిస్తున్న ‘రాధే’ కోసం “సీటీమార్” పాటని రీమిక్స్ రూపంలో హిందీ జనాలకు అందించే ప్రయత్నం చేస్తున్నాడు సల్లూ భాయ్. ఒరిజినల్ వెర్షన్‌కి బాణీ అందించిన దేవిశ్రీ ప్రసాద్‌నే ఈ రీమిక్స్ కి కూడా ట్యూన్ కడుతున్నాడు. అంతటితో ‘సీటీమార్’ కనెక్షన్‌ని కట్ చేయకుండా నెక్స్ట్ వెంచర్ ‘కభీ ఈద్ కభీ దివాలీ’కి కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాడు సల్మాన్. అందులో భాగంగానే ఆ సినిమాలో కథానాయికగా పూజా హెగ్డేకి ఛాన్స్ ఇచ్చాడు. అలా.. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్‌లో హిట్ సాంగ్‌కి సంబంధించిన కనెక్టివిటీని కంటిన్యూ చేశాడు ఈ ‘దబాంగ్’ స్టార్. మరి.. ఫస్ట్ సాంగ్, ఆ నెక్స్ట్ హీరోయిన్ అన్నట్లుగా ఉన్న సల్మాన్ స్ట్రాటజీ.. బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు మ్యాజిక్ చేస్తుందో చూడాలి.
కాగా ‘వాంటెడ్’(2009), ‘దబాంగ్ 3’(2019) తరువాత సల్మాన్ ఖాన్, ప్రభుదేవా కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో సహజంగానే ‘రాధే’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ‘హౌస్‌ఫుల్ 4’ డైరెక్టర్ ఫర్హాద్ సామ్‌జీ దర్శకత్వంలో వస్తున్న ‘కభీ ఈద్ కభీ దివాలీ’పై కూడా సల్మాన్ అభిమానుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.
![]() |
![]() |