![]() |
![]() |

'పలాస'తో దర్శకుడిగా పరిచయమైన కరుణకుమార్, రెండో సినిమాకి రెడీ అవుతున్నాడు. తెలుగులోనూ రా అండ్ రియలిస్టిక్ సినిమాలు తీయగల దర్శకులు ఉన్నారని తొలి సినిమాతో నిరూపించిన అతడికి గీతా ఆర్ట్స్ సహా మరో రెండు మూడు ప్రొడక్షన్ హౌస్ లు అడ్వాన్సులు ఇచ్చాయి. రాజశేఖర్ హీరోగా కరుణకుమార్ దర్శకత్వంలో సినిమా రూపొందనుందని ఇండస్ట్రీ గుసగుస. అయితే, రాజశేఖర్ కాదు... సుధీర్ బాబుతో కరుణకుమార్ సినిమా తీయనున్నాడు.
'పలాస' చూసిన తర్వాత కరుణకుమార్ కి సుధీర్ బాబు ఫోన్ చేసి అభినందించారనీ, తర్వాత మంచి కథ ఉంటే చెప్పమని అడిగారట. తొలుత ఓ కథ చెప్పగా, తాను ఇప్పటివరకు చేయనటువంటి కథ చెప్పమని అడగ్గా... 'పలాస' తరహాలో గ్రామీణ నేపథ్యంలో కథను కరుణకుమార్ చెప్పాడట. కథ నచ్చడంతో సుధీర్ బాబు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలిసింది. అయితే, అతడితో సినిమా కంటే ముందు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫార్మ్ కోసం ఒక వెబ్ సిరీస్ తీయడానికి కరుణకుమార్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
![]() |
![]() |