![]() |
![]() |

తెలంగాణ ప్రభుత్వంలో తెలుగు చిత్ర పరిశ్రమలో సమస్యలకు పరిష్కార మార్గం అన్వేషించడం, చిత్రీకరణలు పునః ప్రారంభించడానికి విధి విధానాలు రూపొందించడం కోసం చిరంజీవి ఇంట్లో తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, టాలీవుడ్ పెద్దలు సమావేశమైన సంగతి తెలిసిందే. ఆ సమావేశానికి పరిశ్రమలో అగ్ర కథానాయకుడు, నిర్మాత బాలకృష్ణను ఆహ్వానించలేదు. ఆ విషయంలో ఇండస్ట్రీ పెద్దల తీరును పలువురు తప్పుబట్టారు. బాలకృష్ణ సైతం తనను పిలవలేదని చెప్పారు. ఆయనకు చిరంజీవి నుండి ఆహ్వానం అందకపోవడం ఇది రెండోసారి.
సౌతిండియాలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 80వ దశకంలో స్టార్స్ అందరూ 'క్లాస్ ఆఫ్ ఎయిటీస్' అని ఓ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి సంవత్సరం ఎక్కడో ఒక చోట అందరూ పార్టీ చేసుకుంటారు. చెన్నై, బెంగళూరు, కొచ్చిన్, హైదరాబాద్ నగరాల్లో స్టార్స్ ఇళ్లల్లో ఈ పార్టీలు జరుగుతాయి. ఈ ఏడాది హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో జరిగింది. ఆ పార్టీకి తనను ఆహ్వానించలేదని బాలకృష్ణ స్పష్టం చేశారు. తనను ఆహ్వానించకపోవడం కంటే పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిదనీ, తన పద్దతిలో తాను ముందుకు వెళతానని బాలకృష్ణ స్పష్టం చేశారు.
![]() |
![]() |