![]() |
![]() |

సమాజంలోని వర్ణవివక్ష, మనుషుల మధ్య అంతరాలను సహజంగా చూపిస్తూ సినిమాలు తెరకెక్కించడంలో కోలీవుడ్ కెప్టెన్ వెట్రిమారన్ ది ప్రత్యేక శైలి. వెర్సటైల్ స్టార్ ధనుష్ కాంబినేషన్ లో `ఆడుకలమ్`, `వడచెన్నై`, `అసురన్` వంటి సెన్సేషనల్ మూవీస్ ని రూపొందించి.. జాతీయ పురస్కారాలు సైతం అందుకున్న వైనం వెట్రిమారన్ సొంతం. ప్రస్తుతం వెట్రిమారన్.. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, సూరి, గౌతమ్ మీనన్ ప్రధాన పాత్రల్లో `విడుదలై` తెరకెక్కిస్తున్నారు. అలాగే సూర్యతో `వడివాసల్` రూపొందించనున్నారు.
అంతేకాదు.. త్వరలో లోకనాయకుడు కమల్ హాసన్ తోనూ ఓ క్రేజీ ప్రాజెక్ట్ ని రూపొందించనున్నారట. ఇప్పటికే ఈ మేరకు చర్చలు కూడా జరిగాయని కోలీవుడ్ బజ్. ప్రస్తుతం `ఖైదీ` ఫేమ్ లోకేశ్ కనకరాజ్ తీర్చిదిద్దుతున్న `విక్రమ్`లో గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నారు కమల్. ఆపై జీతూ జోసెఫ్ దర్శకత్వంలో `దృశ్యం 2` రీమేక్ చేయనున్నారు. ఈ సినిమాల తరువాతే వెట్రిమారన్ కాంబినేషన్ మూవీ తెరకెక్కనుందని సమాచారం. త్వరలోనే కమల్, వెట్రిమారన్ ఫస్ట్ జాయింట్ వెంచర్ పై క్లారిటీ రానున్నది. మరి.. కమల్ తో వెట్రిమారన్ ఏ తరహా చిత్రాన్ని తెరకెక్కిస్తారో చూడాలి.
![]() |
![]() |