![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య చిత్రం చేస్తున్నారు. ఇటీవలే మళ్ళీ సెట్స్ పైకి వెళ్ళిన ఈ సినిమా.. మార్చి కల్లా చిత్రీకరణ పూర్తిచేసుకోనుంది. ఆపై వేదాళమ్ రీమేక్ షూట్ లో పాల్గొంటారు చిరు. మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ఈ క్రేజీ వెంచర్ ని ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించనుంది. మార్చి లో చిత్రీకరణ మొదలుపెట్టి 2021 విజయదశమికి సినిమాని థియేటర్లలో రిలీజ్ చేయాలని యూనిట్ ప్లాన్ చేస్తోందట.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా కోసం చిరంజీవి తన కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా అత్యథిక పారితోషికం అందుకుంటున్నారట. ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం.. అక్షరాలా రూ.60 కోట్ల రెమ్యూనరేషన్ ని వేదాళమ్ రీమేక్ కోసం తీసుకుంటున్నారట చిరు. మరి.. ఈ వార్తల్లో నిజానిజాలెంతో తెలియాల్సి ఉంది.
కాగా, వేదాళమ్ రీమేక్ కి మణిశర్మ తనయుడు మహతి స్వర సాగర్ బాణీలు అందించనున్నారు.
![]() |
![]() |