![]() |
![]() |

ఇటీవల కాలంలో చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని సాధించిన చిత్రం 'బేబీ'. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో సాయి రాజేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఈ ఏడాది జూలై 14న విడుదలై ఏకంగా రూ.80 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మూవీకి వసూళ్ళు ఏ స్థాయిలో వచ్చాయో.. టైటిల్ రోల్ పోషించిన వైష్ణవి చైతన్యకి కూడా అదే స్థాయిలో పేరొచ్చింది. తాజాగా ఈ అమ్మడు ఓ బంపరాఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది.
యూట్యూబర్ గా కెరీర్ స్టార్ట్ చేసిన వైష్ణవి.. షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లు చేసుకుంటూ.. కొన్ని సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ లో మెరిసింది. అలాంటి వైష్ణవికి బేబీ ఆఫర్ వెతుక్కుంటూ వచ్చింది. ఆ సినిమా ఘన విజయం సాధించడంతో పాటు, వైష్ణవి నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఇండస్ట్రీ దృష్టి ఆమెపై పడింది. తాజాగా ఆమె ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ లో ఓ సినిమా చేసే అవకాశం దక్కించుకుందని సమాచారం. సితార బ్యానర్ ఓ వైపు బడా సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు అప్ కమింగ్ నటీనటులతో యూత్ ఫుల్ మూవీస్ చేస్తోంది. ప్రస్తుతం సితార పలు చిత్రాలను నిర్మిస్తోంది. మరి వాటిలో వైష్ణవికి ఎందులో అవకాశం వచ్చిందో తెలియాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ పెద్ద బ్యానర్ల దృష్టి వైష్ణవిపై పడటం విశేషం. ఇదే జోరు కంటిన్యూ అయితే యంగ్ హీరోల సినిమాలకు బెస్ట్ ఆప్షన్ అయ్యే అవకాశముంది.
![]() |
![]() |