![]() |
![]() |

'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రం 'గుంటూరు కారం'. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఫస్ట్ సింగిల్ అప్పుడు ఇప్పుడు అంటూ కొద్దిరోజులుగా రకరకాల డేట్స్ వినిపించాయి. అయితే తాజాగా గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ పై క్లారిటీ వచ్చేసింది.
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ ఎంటర్టైనర్ 'మ్యాడ్' అక్టోబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ మూవీ ప్రెస్ మీట్ జరగగా.. నిర్మాత సూర్యదేవర నాగవంశీకి మీడియా నుంచి "గుంటూరు కారం ఫస్ట్ సింగిల్ ఎప్పుడు?" అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై స్పందించిన నాగవంశీ "ఇంకా డేట్ అనుకోలేదు. కానీ దసరాకు ముందే ఉంటుంది" అని తెలిపారు.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా 2024, జనవరి 12న విడుదల కానుంది. మొదట్లో షూటింగ్ ఆలస్యం కావడంతో అసలు ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ ఆ తర్వాత జెట్ స్పీడ్ లో షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉంది మూవీ టీమ్. పైగా ఇప్పుడు ఫస్ట్ సింగిల్ కూడా దసరా లోపు రానుందని తెలియడంతో.. మూవీ అనుకున్న టైంకి వస్తుందని, అందుకే సాంగ్స్ తో ప్రమోషన్స్ మొదలుపెట్టబోతున్నారని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.
![]() |
![]() |