![]() |
![]() |
తలైవా రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘చంద్రముఖి’ ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసింది. ఈ సినిమా తర్వాత అలాంటి కథాంశాలతోనే ఎన్నో సినిమాలు వచ్చాయి. ఆ సినిమా అందర్నీ అంత ప్రభావితం చేసింది. అలాంటి సినిమాలు ఎన్నో వచ్చినప్పటికీ మళ్ళీ అదే కథాంశాన్ని పొడిగిస్తూ పి.వాసు చేసిన ‘చంద్రముఖి 2’ సెప్టెంబర్ 28న విడుదల కాబోతోంది. రెండో భాగంలో రజనీకాంత్ బదులు రాఘవ లారెన్స్ నటించారు. తన గురువైన రజనీ సార్ చేసిన క్యారెక్టర్ తను చేయడం ఎంతో సంతోషాన్నిస్తోందని సినిమా షూటింగ్ టైమ్‌లోనే పలుసార్లు లారెన్స్ చెప్పారు. ఇప్పుడు సినిమా రిలీజ్ కాబోతున్న సమయంలో తన గురువు ఆశీస్సులు అందుకున్నారు లారెన్స్.
చెన్నయ్‌లోని రజనీకాంత్ నివాసానికి వెళ్ళిన లారెన్స్ మొదట ఆయన కాళ్ళకు మొక్కి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే రజనీ హీరోగా వచ్చిన ‘జైలర్’ ఘనవిజయం సాధించినందుకు ఆయన్ని అభినందించారు లారెన్స్. తను రజనీకాంత్‌ను కలిసిన ఫోటోలను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘జైలర్ సూపర్‌హిట్ సాధించిన నేపథ్యంలో గురువుగారిని అభినందించానని, అలాగే ‘చంద్రముఖి 2’ విడుదలవుతున్న సందర్భంగా ఆయన ఆశీస్సులు అందుకున్నానని.. చాలా సంతోషంగా ఉందని అన్నారు. రజనీ సార్ చాలా గొప్ప వ్యక్తి అని చెప్పారు. ‘గురువే శరణం’ అని అన్నారు. ట్వీట్ చేశారు లారెన్స్.
![]() |
![]() |