Home

»

Latest News

వంశీతో కుదర్లేదు..మరి 101 ఎవరితో..?

Nov 23, 2016 3:22PM

ప్రస్తుతం ఇండస్ట్రీలోని అందరి కళ్లు బాలకృష్ణ వందో సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి మీదే. ఇప్పటికే ఫినిషింగ్ స్టేజ్‌కొచ్చింది ఈ సినిమా షూటింగ్. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తన 101వ సినిమాపై ఫోకస్ పెట్టాడు బాలయ్య. అయితే శాతకర్ణి తర్వాత తాను కృష్ణవంశీ దర్శకత్వంలో నటిస్తున్నట్టు ముందే ప్రకటించాడు నటసింహం. ఈ సినిమాలో కీలకపాత్ర కోసం బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ని కూడా సంప్రదించాడు. అయితే తాను జూలై వరకు డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని బిగ్ బి హ్యాండివ్వడంతో రైతు టీమ్ డైలమాలో పడింది.

అమితాబ్ కోసం సినిమాను అప్పటి వరకు సెట్స్ పైకి వెళ్లకుండా ఆపడం కుదరదు అందుకే తాత్కాలికంగా సినిమా వాయిదా పడింది. ఈ సంగతి పక్కనబెడితే తన 101వ సినిమాని బాలయ్య మరో దర్శకుడితో చేసే అవకాశముందని ఫిల్మ్‌నగర్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ మాస్ కమర్షియల్ కథలో నటించేందుకు బాలయ్య కథలు వింటున్నట్లు సమాచారం. దర్శకులుగా బోయపాటి శ్రీను, పూరి జగన్నాథ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దీనిపై ఓ క్లారిటీ రావాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com