![]() |
![]() |

బుల్లితెరపై వ్యాఖ్యాతగా తనదైన ముద్ర వేసిన `జబర్దస్త్` బ్యూటీ అనసూయ.. వెండితెరపై నటిగా విభిన్న పాత్రల్లో రాణించే ప్రయత్నం చేస్తోంది. `క్షణం` (2016), `రంగస్థలం` (2018) చిత్రాల్లో కీలక పాత్రలు పోషించి మెప్పించిన ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.. `విన్నర్` (2017), `ఎఫ్ 2` (2019) సినిమాల్లో ప్రత్యేక గీతాలతోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం అనసూయ చేతిలో `ఆచార్య`, `ఖిలాడి`, `పుష్ప` వంటి బిగ్ టికెట్ ఫిల్మ్స్ ఉన్నాయి. వీటన్నింటిలోనూ అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో అనసూయ కనిపించనుందని సమాచారం. అలాగే క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ రూపొందిస్తున్న `రంగమార్తాండ`లోనూ ఓ ముఖ్య భూమికలో దర్శనమివ్వనుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఆంథాలజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట అనసూయ. ఆరు కథల సమ్మేళనంగా తెరకెక్కుతున్న ఈ సినిమాని `పేపర్ బాయ్`, `విటమిన్ షి` చిత్రాల దర్శకుడు జయశంకర్ రూపొందిస్తున్నారు. కాగా, ఇందులో ఓ కథ పూర్తిగా అనసూయ చుట్టూ తిరుగుతుందని సమాచారం. అంతేకాదు.. ఎయిర్ హోస్టెస్ రోల్ లో అను కనిపించబోతోందని, వచ్చే నెల నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొనబోతోందని ప్రచారం సాగుతోంది. మరి.. ఈ కొత్త వేషం `జబర్దస్త్ `బ్యూటీకి ఎలాంటి గుర్తింపు తీసుకువస్తుందో చూడాలి.
![]() |
![]() |