![]() |
![]() |

2019 సంక్రాంతికి విడుదలైన `ఎఫ్ 2` ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ``అంతేగా.. అంతేగా..`` అంటూ కో-బ్రదర్స్ గా విక్టరీ వెంకటేశ్, మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ చేసిన సందడి ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ ని బ్లాక్ బస్టర్ బాట పట్టించింది. కట్ చేస్తే.. దాదాపు మూడేళ్ళ తరువాత మరోసారి తోడల్లుళ్ళుగా పలకరించబోతున్నారు వెంకీ, వరుణ్. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న ఆ సినిమానే `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి దర్శకత్వంలోనే తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. `ఎఫ్ 2`కి బాణీలందించిన రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతసారధ్యంలోనే `ఎఫ్ 3` కూడా రూపొందుతోంది. కాగా, ఆగస్టు 2 డీఎస్పీ పుట్టినరోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని `ఎఫ్ 3` ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయడానికి యూనిట్ ప్లాన్ చేస్తోందట. మరి.. `ఎఫ్ 2`కి ఎస్సెట్ గా నిలిచిన దేవి శ్రీ బాణీలు.. `ఎఫ్ 3`కి కూడా ప్లస్ అవుతాయేమో చూడాలి.
కాగా, `ఎఫ్ 3`లో మిల్కీ బ్యూటీ తమన్నా, స్టన్నింగ్ బ్యూటీ మెహరీన్ నాయికలుగా నటిస్తున్నారు. తెలుగమ్మాయి అంజలి ఓ ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.
![]() |
![]() |