![]() |
![]() |

`సరిలేరు నీకెవ్వరు`లో సూపర్ స్టార్ మహేశ్ బాబుకి జంటగా అలరించింది నేషనల్ క్రష్ రష్మికా మందన్న. ``మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్`` అంటూ చిందులేసి కనువిందు చేసింది. కట్ చేస్తే.. మరోమారు మహేశ్ తో జతకట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట ఈ టాలెంటెడ్ యాక్ట్రస్.
ఆ వివరాల్లోకి వెళితే.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో `అతడు`, `ఖలేజా` తరువాత మహేశ్ ముచ్చటగా మూడోసారి నటించనున్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ సినిమాలో `బుట్టబొమ్మ` పూజా హెగ్డే ఓ హీరోయిన్ గా నటించనుండగా.. రష్మిక మరో నాయికగా ఎంపికైందని బజ్. మరి.. ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
కాగా, మహేశ్ ప్రస్తుతం `సర్కారు వారి పాట`తో బిజీగా ఉన్నారు. పరశురామ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ నాయికగా నటిస్తోంది. వేసవి కానుకగా ఏప్రిల్ 1న ఈ భారీ బడ్జెట్ మూవీ రిలీజ్ కానుంది. మరోవైపు రష్మిక `పుష్ప`, `ఆడవాళ్ళు మీకు జోహార్లు` చిత్రాలు చేస్తోంది. అలాగే హిందీలో `మిషన్ మజ్ను`, `గుడ్ బై` సినిమాల్లో నటిస్తోంది.
![]() |
![]() |