![]() |

-సెన్సార్ టాక్ ఎలా ఉంది
-యు/ఏ ఇవ్వడానికి కారణం
-డిసెంబర్ 4 నుంచే జాతర స్టార్ట్
గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ(Balakrishna)వన్ మాన్ షో 'అఖండ 2'(Akhanda 2)సాధించే విజయంపై ఎవరకి ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అంత నమ్మకం అని ఎవరైనా అంటే,వాళ్ళకి ట్రైలర్ చూపిస్తే చాలు విజయం అంటారేంటి ఘన విజయం సాదిస్తుందని వాళ్లే చెప్తారు. అంత పాజిటివ్ వైబ్రేషన్స్ ని అఖండ 2 తన సొంతం చేసుకుంది.డిసెంబర్ 5 రిలీజ్ డేట్ అయినా కూడా ముందు రోజు నుంచే ప్రీమియర్స్ పడటంతో వరల్డ్ వైడ్ గా ఉన్న థియేటర్స్ సరికొత్తగా ముస్తాబవవుతున్నాయి.
రీసెంట్ గా అఖండ 2 సెన్సార్ కి వెళ్లగా సెన్సార్ వాళ్ళు మూవీని వీక్షించి యు/ ఏ సర్టిఫికెట్ ని జారీచేయడం జరిగింది. యు/ ఏ ఇవ్వడంపై కొంత మంది సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు అఖండ 2 లో హింసకి సంబంధించిన సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్టుగా ట్రైలర్ ద్వారా చాలా స్పషంగా అర్ధమవుతుంది. హింసకి సంబంధించి రెండు మూడు సన్నివేశాలు ఉన్నా సెన్సార్ వాళ్ళు యూ సర్టిఫికెట్ ని మాత్రమే జారీ చేస్తారు. మరి అలాంటిది అఖండ 2 కి యు/ ఏ ఎలా ఇస్తారని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. వీటిపై సినీ విశ్లేషకులు, బాలయ్య అభిమానులు కూడా సోషల్ మీడియా వేదికగా స్పందిస్తు హింస సన్నివేశాలు ఉన్నా కూడా అంతకి మించి డే వోషనల్ టచ్ ఉండటం వల్లనే యు / ఏ ఇచ్చారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
also read: స్పిరిట్ ఓటిటి డీల్ పై ఆసక్తికర వార్త.. నిజమేనంటారా!
ఇక మూవీ చూసిన సెన్సార్ వాళ్ళు మాట్లాడుతు 'మూవీ చాలా బాగా వచ్చిందని అఘోర క్యారక్టర్ లోను, మురళి కృష్ణ క్యారక్టర్ లోను బాలయ్య మరో సారి తన నట విశ్వరూపం చూపించారని, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, బోయపాటి శ్రీను దర్శకత్వ ప్రతిభ తో పాటు మిగతా నటీనటులు కూడా చాలా చక్కగా పెర్ఫార్మ్ చేసారని చెప్పినట్టుగా కూడా సినీ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
![]() |