![]() |
![]() |

షూటింగ్ ప్రారంభం కాకముందే ఏంటి ఇదంతా
అసలు ఆ న్యూస్ నిజమేనా!
ప్రభాస్, సందీప్ రెడ్డి క్రేజ్ స్థాయి ఇదేనా!
కొన్ని కాంబినేషన్స్ పై అంచనాలు ఏర్పడటం సహజం. ఆ తాలూకు అంచనాలని పలు రకాలుగా ఉదహరిస్తు కూడా చెప్పుకోవచ్చు. కానీ కొన్ని కాంబినేషన్స్ మాత్రం ఆ అంచనాల స్థాయిని మించి తెరకెక్కుతాయి. అలాంటి ఒక కాంబినేషన్ ప్రభాస్(Prabhas),సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga).పాన్ ఇండియా సిల్వర్ స్క్రీన్ వద్ద ఈ ఇద్దరి కటౌట్స్ కి ఉన్న క్రేజ్ తెలిసిందే. ఆ ఇద్దరి 'స్పిరిట్' అధికారకంగా ప్రారంభమైనప్పట్నుంచి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో స్పిరిట్ అప్ డేట్ గురించి తెలుసుకోవడం తమ రోజువారి దినచర్యలో భాగమైంది. రీసెంట్ గా స్పిరిట్ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
ప్రముఖ ఓటిటి సంస్థ స్పిరిట్ డిజిటల్ హక్కులని 160 కోట్ల రూపాయిల భారీ మొత్తాన్ని చెల్లించి పొందినట్టుగా సోషల్ మీడియా లేటెస్ట్ టాక్ .టాలీవుడ్ సర్కిల్స్‌లో కూడా సదరు టాక్ బాగానే వినిపిస్తుంది.ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు గాని ఈ మధ్య కాలంలో షూటింగ్ ప్రారంభం కాకముందే అంత భారీ ధరకి కొనుగోలు చెయ్యడం అంటే రికార్డు అని చెప్పుకోవచ్చు. అగ్ర హీరోల సినిమా ఓటిటి హక్కులు పొందే విషయంలో ఓటిటి సంస్థల మధ్య పోటీ వాతావరణం ఉంటుంది. అందుకే చాలా సంస్థలు సినిమా ప్రారంభ దశలోనే భారీ మొత్తంలో చెల్లించి స్ట్రీమింగ్ హక్కులని పొందుతాయి. పైగా ప్రభాస్, సందీప్ రెడ్డి ఇద్దరు పాన్ ఇండియా స్థాయిలో ఒక బెంచ్ మార్కుని సృష్టించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అంత భారీ మొత్తంలో చెల్లించి ఓటిటి హక్కులు పొందారనే మాట సినీ పరిశీలకులు కూడా వ్యక్తం చేస్తున్నారు.ప్రభాస్, సందీప్ రెడ్డి ఫ్యాన్స్ మాత్రం సదరు న్యూస్ పై తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
also read: అఖండ 2 కి పోటీగా వస్తున్నావా... నిలబడగలరా!
స్పిరిట్ వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూట్ ప్రారంభం కానున్నట్టుగా తెలుస్తుంది. సందీప్ రెడ్డి ఇప్పటికే స్పిరిట్ గురించి చెప్తున్న పలు విషయాలు ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తుండగా ఇంతరకు భారతీయ చిత్ర పరిశ్రమలో తెరకెక్కని ఒక వైవిధమైన సబ్జెట్ తో తెరకెక్కబోతుంది. యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రి(Tripti Dimri)హీరోయిన్. పాన్ ఇండియా యాక్టర్స్ సిల్వర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు.
![]() |
![]() |