![]() |
![]() |

-ఏంటి ఆ దారి
-అందుకే లక్షలాది మంది అభిమానులు
-తోట ప్రసాద్ వెల్లడి
నటభూషణ్ 'శోభన్ బాబు', (sobhan Babu)పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan). ఈ ఇద్దరి పేర్లు పక్క పక్కన ఉంటేనే ఇరువురి అభిమానుల్లో, మూవీ లవర్స్ లో ఒక రకమైన వైబ్రేషన్ కలగడం పక్కా. మరి ఆ ఇద్దరికి సంబంధించి ఒక కామన్ అలవాటు ఉందని తెలిస్తే వారి ఆనందం యొక్క స్థాయిని కొలవడం కొంచం కష్టమే. ఆ కోవలోనే రీసెంట్ గా ఈ ఇద్దరికి సంబంధించిన ఒక కామన్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చేస్తుంది.
ప్రముఖ రచయిత తోటప్రసాద్(Thota Prasad)రీసెంట్ గా ప్రముఖ మీడియా ఛానల్ తెలుగు వన్(Telugu One)కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. అందులో ఆయన మాట్లాడుతూ శోభన్ బాబు గారు ఇంటర్వ్యూలో డైరెక్ట్ గా సమాధానాలు చెప్పే వారు కాదు. మనం క్వశ్చన్ పేపర్ ఇస్తే రెండు మూడు రోజులు టైం తీసుకొని ఆన్సర్స్ రాసిచ్చే వాళ్ళు. మాట్లాడే ప్రాసెస్ లో పొరపాటున తన సమాధానాలతో ఎవర్నైనా హార్ట్ చేస్తానేమో అనే భయంతో ప్రిపేర్ అయ్యి రాసిచ్చే వాళ్ళు.
చాలా కాలం పాటు జ్యోతిచిత్ర మ్యాగజైన్ కి చెందిన లైబ్రరీ లో ఆయన హ్యాండ్ రైటింగ్ తో రాసిన ఇంటర్వ్యూ తాలూకు పేపర్స్ ఉండేవి. అదే అలవాటు పవన్ కళ్యాణ్ కి ఉంది. తన అన్నయ్య చిరంజీవి(Chiranjeevi)తో ఉన్న అనుబంధం గురించి చెప్పమని అడిగాను. వామ్మో నేను మాటల్లో చెప్పలేనని సమాధానాలు ముందుగానే రాసి ఇచ్చారు. ఆ విధంగా ఇంటర్వూస్ కి ముందుగా ప్రిపేర్ అయ్యి ఆన్సర్స్ చెప్పిన వాళ్ళు ఇండస్ట్రీలో శోభన్ బాబు, పవన్ కళ్యాణ్ మాత్రమే అని తోట ప్రసాద్ చెప్పుకొచ్చారు.
also read: యు /ఏ ఎందుకు ఇచ్చారు! సెన్సార్ రిపోర్ట్ ఇదే
తోట ప్రసాద్ కి చిత్ర పరిశమ్రతో మూడు దశాబ్దాలకి పైగా అనుబంధం ఉంది. ఎన్నో అగ్ర చిత్రాలకి సహాయ రచయిత గా పని చెయ్యడంతో పాటు ఎంతో అగ్ర దర్శకులకి సినిమా పూర్తయ్యే దాకా చేదోడు వాదోడుగా ఉన్నాడు. సినీ జర్నలిస్ట్ గా పని చేసిన అనుభవం కూడా ఆయన సొంతం.
![]() |
![]() |