![]() |
![]() |
హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్ త్వరలోనే వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. జూలై 2న నికోలాయ్ సచ్‌దేవ్‌తో ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే కోలీవుడ్‌లోని ప్రముఖుల్ని వివాహానికి ఆహ్వానిస్తూ బిజీగా ఉంది వరలక్ష్మీ. రజనీకాంత్, కమల్ హాసన్, ప్రభు, నయనతార, విఘ్నేష్ శివన్, సిద్ధార్థ్ వంటి తారలు ఆహ్వానాలు అందుకున్నారు.
టాలీవుడ్ నుంచి కూడా కొందరు సెలబ్రిటీలను ఆమె ఆహ్వానించనుంది. వరలక్ష్మి పెళ్లి వేడుక కోసం థాయ్‌లాండ్‌లో అద్భుతమైన రిసార్ట్‌ని బుక్ చేశారని తెలుస్తోంది. అయితే విషయాన్ని మాత్రం సస్పెన్స్‌లో ఉంచారు. మెహందీ, హల్దీ వంటి కార్యక్రమాలను చెన్నయ్‌లోనే నిర్వహిస్తారు. వివాహ వేడుక మాత్రం థాయ్‌లాండ్‌లో జరుగుతుందట. పెళ్లి తర్వాత చెన్నయ్‌లో రిసెప్షన్‌ను ఘనంగా నిర్వహిస్తారని సమాచారం. తమిళ్ హీరో విశాల్‌ను వరలక్ష్మీ పెళ్ళి చేసుకోబోతోందనే వార్తలు గతంలో బాగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ విషయంలో ఇద్దరూ ఎలాంటి కామెంట్స్ చెయ్యలేదు. చివరికి తన స్నేహితుడు నికోలాయ్‌ను పెళ్లి చేసుకోబోతున్న ప్రకటించి అందర్నీ ఆశ్చర్యపరచింది. ఇక వరలక్ష్మీ చేస్తున్న సినిమాల విషయానికి వస్తే హీరో ధనుష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రాయన్’ జూలై 26న విడుదల కానుంది.
![]() |
![]() |