![]() |
![]() |
.webp)
మూవీ: వర్షంగళ్కు శేషం
నటీనటులు: ప్రణవ్ మోహన్ లాల్, ధ్యాన్ శ్రీనివాసన్, కళ్యాణి ప్రియదర్శిని, నివిన్ పౌలి, వినీత్ శ్రీనివాసన్, నీతా పిల్లై తదితరులు
ఎడిటింగ్: రంజిత్
సంగీతం: అమృత్ రామ్ నాథ్
సినిమాటోగ్రఫీ: విశ్వజిత్
నిర్మాతలు: విశ్వక్ సుబ్రహ్మణ్యం
దర్శకత్వం: వినీత్ శ్రీనివాసన్
ఓటీటీ : సోని లివ్
మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ మోహన్ లాల్ నటించిన మూవీ ' వర్షంగళ్కు శేషం'. ఈ మూవీ మళయాళంలో విడుదలై మిశ్రమ స్పందనలు తెచ్చుకుంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక సోనిలివ్ లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ సినిమా కథేంటో ఓసారి చూసేద్దాం...
కథ:
కేరళలో 1980-1990 లలో జరిగిన కథే ఈ సినిమా. ఒక సూపర్ హిట్ డైరెక్టర్ వేణు(ధ్యాన్ శ్రీనివాసన్) తన స్నేహితుడు మురళి(ప్రణవ్ మోహన్ లాల్) కోసం ప్రయాణం మొదలుపెడతాడు. క్యాబ్ డ్రైవర్(వినీత్ శ్రీనివాసన్)కి తన కథ మొత్తం వేణు చెప్తుండు. దాని ప్రకారం కేరళకి చెందిన వేణుకి చిన్నప్పటి నుంచి నాటకాల మీద ఆసక్తి ఎక్కువ. తనను పట్టించుకోకపోయిన ఊరిలో జరిగే నాటక ఉత్సవాలలో యాక్టివ్ గా ఉంటాడు. ఒకరోజు అదే నాటకాల ద్వారా మురళి అనే ఒక సంగీత విద్వాంసుడితో పరిచయమవుతుంది. మురళి ట్యాలెంట్ చూసి మద్రాసు వెళితే బావుంటుందని వేణు సలహా ఇస్తాడు. అప్పటికి లైట్ తీసుకున్నా సరే కొన్ని రోజుల తర్వాత వేణుని కూడా రమ్మని మురళి చెన్నై వెళ్తాడు. అక్కడికి వెళ్లి వేణు దర్శకుడి దగ్గర పని చేస్తుండగా.. మురళి సంగీతంలో తన మార్క్ వేయాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. అయితే మురళి చేసిన ప్రయత్నంతో వేణుకి దర్శకత్వం చేసే అవకాశం వస్తుంది. తన మొదటి సినిమాకి సంగీతం ఇవ్వమని అడిగితే మురళి ఇవ్వకుండా.. తన సంగీతం వేరే సంగీత దర్శకుడికి ఇచ్చి అతని చేత పాటలు రిలీజ్ చేయిస్తాడు. దర్శకుడైన తర్వాత వేణు తన రూమ్ నుంచి వెళ్లిపోవడంతో ఒంటరిగా ఫీల్ అయిన మురళి తాగుడికి బానిసై సంగీతం మీద పట్టు కోల్పోతాడు. ఒకానొక సమయంలో వేణు, మురళి ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. వేణు దర్శకుడిగా ఎదుగుతూ వెళితే మురళి మాత్రం ఏమైపోయాడో కూడా తెలియని పరిస్థితుల్లో మాయమతాడు. అలా వీరిమధ్య దూరం పెరుగుతుంది. వేణు, మురళి కలిసారా? వాళ్ళిద్దరు కలిసి ఆ సినిమాని పూర్తి చేశారా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ:
తాజాగా తెలుగులో 90s వెబ్ సిరీస్ ఎలా ఉందో.. ఎలా ఆనాటి గుర్తులని ఆ జనరేషన్ వాళ్ళు గుర్తుతెచ్చుకున్నారో.. అచ్చం అలాగే ఈ సినిమాని చూస్తే కలుగుతుంది. అయితే ఈ మూవీ కాస్త స్లోగా సాగుతుంది. పల్లెటూరులో ఇద్దరు స్నేహితుల మధ్య సాగే చిన్న చిన్న సంభాషణలు, విషయాలు, ఇష్టాలు, ఇలా అన్నింటిని ఒకరికొకరు పంచుకోవడం.. ఒకరి కల కోసం మరొకరు తీవ్రంగా శ్రమించడం లాంటివి చూస్తుంటే.. అబ్బా ఆ రోజుల్లో స్నేహం అంటే ఇంత స్వచ్ఛంగా ఉండేదా అనేలా ఉంటుంది. అయితే దర్శకుడు వినీత్ శ్రీనివాసన్ ఫస్టాఫ్ ని పూర్తి చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు.
భారీ తారాగణం ఉన్నప్పటికి దర్శకుడు ఎవరిని అంతగా వాడుకోలేదని అనిపిస్తుంది. ఫీల్ గుడ్ ఎలిమెంట్స్ ఫ్లాష్ బ్యాక్ లో చాలా చోట్ల యాడ్ చేయొచ్చు కానీ ఎక్కడ అంతగా ఇంపాక్ట్ ఇవ్వదు. అడల్ట్ సీన్స్ ఏమీ లేవు. అయితే అన్ని పాటలని తెలుగులోకి డబ్ చేశారు కానీ మెయిన్ సాంగ్ ని అలాగే ఉంచేశారు. కళ్యాణి ప్రియదర్శిని గారి రోల్ ఎందుకు ఉందో అర్థం కాదు. మళ్ళీ అన్ని సంవత్సరాల తర్వాత హీరోని కలవడం, ఫస్టాఫ్ లో రిజెక్ట్ చేయడం.. వాళ్ళు ఓల్డేజ్ కు వచ్చినట్టుగా చూపించే ఆ సీన్స్ కూడా బాలేవు.
సినిమా నిడివి చాలా ఎక్కువ. రెండు గంటల నలభై నాలుగు నిమిషాల నిడివితో ఉన్న ఈ సినిమాని ఎడిటింగ్ లో అలానే వదిలేసినట్టు చాలానే సీన్స్ ఉన్నాయి. చాలా చోట్ల స్కిప్ చేయకుండా సినిమాని చూడలేం. మలయాళ సినిమాల్లో సినిమాటోగ్రఫీ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. అయితే సినిమాకి ప్రధాన బలం ఏంటంటే క్యారెక్టర్ల పర్ఫామెన్స్. ఓల్డెన్ డేస్ లో జరిగిన సంఘటనలని రిక్రియేట్ చేయాలనుకున్నాడు దర్శకుడు. అయితే అది చూపించడానికి అతను ఎక్కువ సమయం తీసుకున్నాడనిపిస్తుంది. ఓ వర్గం వారిని ఆకర్శించేలా కొన్ని ఫీల్ గుడ్ సీన్లు ఉన్నాయి. రంజిత్ ఎడిటింగ్ పర్వాలేదు. విశ్వజిత్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. అమృత్ రామ్ సంగీతం బాగుంది. నిర్మాణ విలవలు బాగున్నాయి.
నటీనటుల పనితీరు:
వేణు పాత్రలో ధ్యాన్ శ్రీనివాసన్, మురళి పాత్రలో ప్రణవ్ మోహన్ లాల్, క్యాబ్ డ్రైవర్ గా వినీత్ శ్రీనివాసన్ ఆకట్టుకున్నారు. ఇక మిగతావారు వారి పాత్రల పరిధి మేర నటించారు.
ఫైనల్ గా : స్లోగా సాగే కథనం.. జస్ట్ వన్ టైమ్ వాచెబుల్.
రేటింగ్: 2.25 / 5
✍️. దాసరి మల్లేశ్
![]() |
![]() |