![]() |
![]() |

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (Vishwak Sen) హీరోగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో రూపొందిన సినిమా 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs Of Godavari). ఈ యాక్షన్ డ్రామా మే 31న థియేటర్లలో విడుదలైంది. రూ.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ మూవీ.. డివైడ్ టాక్ తెచుకున్నప్పటికీ, మంచి వసూళ్లతో బ్రేక్ ఈవెన్ సాధించింది. అయితే ఈ సినిమా అనూహ్యంగా రెండు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూన్ 14 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇటీవల నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. ఇదే సర్ ప్రైజ్ అంటే.. ఈ సినిమా విషయంలో మరో సర్ ప్రైజ్ కి సిద్ధమయ్యారు మేకర్స్.
జూన్ 14న సాయంత్రం 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' థాంక్స్ మీట్ నిర్వహించాలని మేకర్స్ నిర్ణయించారు. హైదరాబాద్ లోని దస్‌పల్లా హోటల్ దీనికి వేదిక కానుంది. ఒక వైపు థియేటర్లలో విడుదలైన రెండు వారాలకే మూవీ ఓటీటీలోకి అడుగు పెడుతోంది అంటే.. మరోవైపు అదే రోజున మేకర్స్ థాంక్స్ మీట్ నిర్వహిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించిన ఈ సినిమాలో అంజలి, నేహా శెట్టి, నాజర్, గోపరాజు రమణ, సాయి కుమార్, హైపర్ ఆది తదితరులు నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.
![]() |
![]() |