![]() |
![]() |

మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారిగా సోషల్ మీడియాను షేక్ చేశారు. 'శివాజీ' సినిమా పతాక సన్నివేశాల్లో 'గుండు బాస్'గా రజనీకాంత్ ఎలా అయితే కనిపించారో... సేమ్ టు సేమ్ మెగాస్టార్ అలాగే కనిపించారు. నున్నగా గుండు కొట్టించుకుని కాస్త గడ్డంతో రఫ్ లుక్ లో రఫ్ఫాడించారు. ఆయన ఈ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో షాక్ అవ్వడం ప్రేక్షకుల వంతు అయింది.
ప్రేక్షకుల మాట పక్కన పెడితే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ సైతం ఈ ఫోటో చూసి షాక్ తిన్నాడు. 'అప్పా (చెన్నైలో పెరగడం వల్ల తండ్రిని 'అప్పా' అని చరణ్ పిలుస్తారు)... నేను ఇప్పుడు ఏం చూశాను" అని చిరంజీవి ఫోటో కింద రామ్ చరణ్ కామెంట్ చేశారు.
ఇక ఈ లుక్ విషయానికి వస్తే... మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించనున్న 'వేదాళం' రీమేక్ కోసం మెగాస్టార్ ఇలా రెడీ అవుతున్నారని టాక్. ఆయన కొత్తగా కనిపించాలని తహతహ లాడుతున్నారట.
![]() |
![]() |