![]() |
![]() |

'ఆర్ఆర్ఆర్'తో తాను ఎంత గొప్ప నటుడో మరోసారి రుజువు చేశాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. 'భీమ్' పాత్రలో ఒదిగిపోయి నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో తారక్ తదుపరి సినిమాలపై ప్రేక్షకుల దృష్టి నెలకొంది. తారక్ తన నెక్స్ట్ మూవీ 'NTR30'ని కొరటాల శివ డైరెక్షన్ లో చేయనున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 31 వ సినిమా చేయనున్నాడు.
ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన 'కేజీఎఫ్-2' విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ఆయన డైరెక్ట్ చేస్తున్న 'సలార్' షూటింగ్ దశలో ఉంది. ఆ తర్వాత తారక్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. తాజాగా ఓ న్యూస్ పోర్టల్ తో మాట్లాడిన ప్రశాంత్.. తారక్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గత 15-20 ఏళ్లుగా తాను తారక్ కి అభిమానిని అని తెలిపాడు. గత రెండేళ్లుగా తాము క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యామని, ఆయనతో జర్నీ బాగుందని అన్నాడు. తాను చెప్పిన స్టోరీ తారక్ కి నచ్చిందని, ప్రస్తుతం దాని మీద వర్క్ చేస్తున్నామని చెప్పాడు. ఈ ప్రాజెక్ట్ గురించి తాను చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నానని, ఇప్పుడే డీటెయిల్స్ చెప్పలేనని, సలార్ షూటింగ్ అయిపోయాక తెలుపుతానని ప్రశాంత్ నీల్ చెప్పుకొచ్చాడు.
'కేజీఎఫ్'తో నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్.. తాను ఎన్టీఆర్ ఫ్యాన్ అని చెప్పడం ఆసక్తికరంగా మారింది. తారక్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపిస్తాడోనని ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్ అవుతున్నారు.
![]() |
![]() |