![]() |
![]() |

'మక్కల్ సెల్వం విజయసేతుపతి'(VIjay Sethupathi)గత ఏడాది 'మహారాజ'(Maharaja)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.తన కూతురు కాకపోయినా కూడా వేరే వాళ్ల కూతుర్ని కన్నకూతురిలా ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటు,ఆమెకి జరిగిన అన్యాయానికి న్యాయం జరగడానికి తన చావుని సైతం లెక్కచేయని చిన్నపాటి అమాయకత్వంతో కూడిన క్యారక్టర్ లో విజయ్ సేతుపతి నటనకి ఇండియన్ చిత్ర సీమనే కాదు చైనా బాక్స్ ఆఫీస్ కూడా నీరాజనాలు పలికింది.
రీసెంట్ గా 'మహారాజ' చిత్రానికి ఉత్తమ నటుడిగా విజయ్ సేతుపతి'బిహైండ్ వుడ్ అవార్డ్ అందుకున్నాడు.ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో విజయ్ మాట్లాడుతు మహారాజ విజయాన్ని నేనెప్పటికీ మర్చిపోను.నా కెరీర్లో ఈ మూవీ ఎంతో ప్రత్యేకమైంది.ఈ సినిమాకి ముందు మూడు సంవత్సరాలు పాటు నా సినిమాలన్నీ ప్లాప్ అయ్యాయి.దీంతో నా కెరీర్ ముగిసిపోయిందని చాలా మంది మాట్లాడారు.అలాంటి టైంలో మహారాజ నన్ను నేను నిరూపించుకునేలా చేసింది.ఈ సినిమాతో ప్రపంచానికి కనెక్ట్ అవుతానని కూడా అనుకోలేదని చెప్పుకొచ్చాడు.
నితిలన్ స్వామినాథన్(Nithilan Swaminathan)దర్శకత్వంలో తెరకెక్కిన మహారాజ లో విజయ్ సేతుపతి తో పాటు అనురాగ్ కశ్యప్(anurag kashyap)అభిరామి,దివ్య భారతి,నటరాజ్ సుబ్రహ్మణ్యన్,మమతా మోహన్ దాస్ కీలక పాత్రలు పోషించారు.దిరూట్,థింక్ స్టూడియోస్, ప్యాషన్ స్టూడియోస్ పతాకంపై సుధన్ సుందరం, జగదీష్ సుందరం 20 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా 190 కోట్లు వసులు చేసింది.
.webp)
![]() |
![]() |