![]() |
![]() |
.webp)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)అప్ కమింగ్ మూవీ హరిహరవీరమల్లు(Hariharaveeramallu)పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.మార్చి 28 న రిలీజ్ అవుతుందని మేకర్స్ చాలా రోజుల కిందటే అధికారకంగా ప్రకటించారు.కానీ ఇప్పుడు ఆ డేట్ కి రిలీజ్ కావడం లేదు.పవన్ ఉపముఖ్యమంత్రి హోదాతో పాటు,పొలిటికల్ గా బిజీగా ఉండి డేట్స్ ఇవ్వకపోవడమే అందుకు కారణం. దీంతో అభిమానులు కొత్త డేట్ కోసం ఎదురుచూస్తు ఉన్నారు.
ఈ క్రమంలో రీసెంట్ గా ఫ్యాన్స్ కి ప్రేక్షకులకి హోలీ శుభాకాంక్షలు చెప్తు మేకర్స్ కొత్త డేట్ ని విడుదల చెయ్యడం జరిగింది.మే 9 న వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ఒక పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో జోష్ ని తీసుకొచ్చింది.మే 9 న చిరంజీవి(Chiranjeevi)శ్రీదేవి(sridevi)కాంబోలో అశ్వనీదత్ నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి వచ్చి ఘన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.దీంతో వీరమల్లుపై సరికొత్త అంచనాలు మొదలయ్యాయి.
వీరమల్లుని మెగా సూర్య ప్రొడక్షన్ పై ఏఏం రత్నం(Am Rathnam)దయాకర్(Dayakar)అత్యంత భారీ వ్యయంతో నిర్మిస్తుండగా పవన్ సరసన నిధి అగర్వాల్(Nidhhi Agerwal) హీరోయిన్ గా చేస్తుంది.బాబీడియోల్, నాజర్,సునీల్, సుబ్బరాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా క్రిష్(Krish)జ్యోతికృష్ణ(Jyothikrishna)సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు.ఆస్కార్ విన్నర్ కీరవాణి(Mm Keeravani)సంగీత దర్శకుడు.ప్రచార చిత్రాలతో పాటు సాంగ్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి.

![]() |
![]() |