![]() |
![]() |

మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr)బాలీవుడ్ లో వార్ 2(War 2)చేస్తున్న విషయం తెలిసిందే.హృతిక్ రోషన్(Hrithik Roshan)తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ మూవీపై పాన్ ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి.ఈ మూవీకి బాలీవుడ్ అగ్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.
రీసెంట్ గా అయాన్ ముఖర్జీ తండ్రి దేబ్ ముఖర్జీ(deb Mukherjee)చనిపోవడం జరిగింది. 83 సంవత్సరాల వయసు గల దేబ్ ముఖర్జీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు.పరిస్థితి విషమించడంతో ఈ రోజు తుదిశ్వాస విడిచారు.మొదటి నుంచి సినిమా ఫ్యామిలీకి చెందిన దేబ్ ముఖర్జీ అధికార్, జీ జీతావొహి,సికందర్ వంటి పలు చిత్రాల్లో నటించాడు.మరో ప్రముఖ దర్శకుడు అశుతోష్ గోవర్కర్ కూడా దేబ్ ముఖర్జీ మొదటి భార్య కొడుకు.

![]() |
![]() |