![]() |
![]() |

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న స్పోర్ట్స్ డ్రామా 'లైగర్'. ఈ పాన్ ఇండియా మూవీ ఆగష్టు 25 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ విడుదల కాకముందే విజయ్-పూరి కాంబినేషన్ లో మరో మూవీ పట్టాలెక్కనుందని, అది పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' అంటూ వార్తలొచ్చాయి. అయితే తాజాగా విజయ్-పూరి కాంబోలో రానున్న నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది.
రేపు(మార్చి 29న) మధ్యాహ్నం 2:20 కి విజయ్-పూరి కాంబోలో నెక్స్ట్ మిషన్ ని లాంచ్ చేయబోతున్నట్లుగా తెలుపుతూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో యుద్ధ విమానాలు, యుద్ధ ట్యాంకర్లు ఉండటం చూస్తుంటే ఇది వార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న మూవీ అనిపిస్తోంది. మరి ఇది పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన' సినిమానో కాదో రేపు క్లారిటీ వచ్చే అవకాశముంది.

ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న 'లైగర్'లో విజయ్ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో సందడి చేయనుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన లైగర్ గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ ని పూరి తన మార్క్ లో కొత్తగా చూపించాడు. మరి ఇప్పుడు నెక్స్ట్ మూవీలో ఇంకెంత కొత్తగా చూపిస్తాడో చూద్దాం.
![]() |
![]() |