![]() |
![]() |

మొన్న మెగా అండ్ అల్లు ఫ్యామిలీ కలిసి క్రిస్టమస్ సెలెబ్రేషన్ ని చాలా ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలో రామ్ చరణ్ ,ఉపాసన, అల్లు అర్జున్,స్నేహ రెడ్డితో పాటు ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠీలు కూడా పాల్గొన్నారు.ఇప్పుడు ఆ ఫంక్షన్ లో ఉపాసన ధరించిన డ్రెస్ గురించి సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది.
ఉపాసన క్రిస్మస్ వేడుకల్లో రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంది. ప్రముఖ లగ్జరి బ్రాండ్ గూచీ కి సంబంధించిన ఆ డ్రెస్ ఖరీదు అక్షరాలా 3 లక్షల రూపాయిలు. అంత ఖరీదైన డ్రెస్ లో ఫంక్షన్ ఆసాంతం ఉపాసన ఒక్కటే ప్రత్యేకంగా మెరిసిపోయింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్ళందరు ఎంతైనా మెగా కోడలు అంటే ఆ మాత్రం రేంజ్ ఉంటుంది కదా అని అనుకుంటున్నారు.

మెగా అండ్ అల్లు ఫ్యామిలీ కలిసి క్రిస్మస్ వేడుకల్ని జరుపుకున్న క్లిప్పింగ్స్ ని మెగా అభిమానులు చాలా ఆనందపడుతున్నారు. కానీ ఒక్క విషయంలో మాత్రం బాధపడుతున్నారు. అదేంటంటే ఈ వేడుకల్లో అయినా తమ అభిమాన కధానాయకుడు చరణ్ కూతురు క్లింకార పేస్ ని చూపిస్తారేమో అని అనుకున్న మెగా అభిమానుల ఆశ నెరవేరలేదు. ఈ వేడుకలో మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా పాల్గొన్నారు.
![]() |
![]() |