Home  »  News  »  యూట్యూబ్ ని షేక్ చేస్తున్న తెలంగాణ సాంగ్.. కానీ డబ్బులు ఎంత వచ్చాయో తెలుసా! 

Updated : Mar 12, 2026

 


-యూట్యూబ్ లో తెలంగాణ సాంగ్స్ జోరు 
-రికార్డు వ్యూస్ తో ఎన్నో సాంగ్స్ 
-అదే దారిలో మరో పాట


తెలంగాణ(Telangana)పల్లెల పరిమళాన్ని వెదజెల్లే ఎన్నో పాటలు సంగీత, సాహిత్య ప్రియుల్ని అలరిస్తూ వస్తున్నాయి. దీంతో రికార్డు వ్యూస్ వాటి వశమవుతున్నాయి. అదే సమయంలో తెలంగాణ ఆడపడుచుల మనో వేదనని పూస గుచ్చినట్టుగా చెప్పే  సాంగ్స్ కూడా పైన చెప్పుకున్న విషయాల్లో వెనక్కి తగ్గడం లేదు. ముఖ్యంగా తమ పెనిమిటి, పరాయి స్త్రీ మోజులో పడి తనని పట్టించుకోవడంలేదనే సాంగ్స్ ఎక్స్ పైరీ డేట్ కి చాలా దూరంగా ఉంటున్నాయి. అలాంటి ఒక సాంగ్ యూట్యూబ్ లో తన హవాని కొనసాగిస్తు వస్తుంది. డీటెయిల్స్ ఏంటో చూద్దాం.  

'ఉడుకుడుకు రొట్టెలు ఉట్టిమీదుండంగా పాస్ పోయిన రొట్టెలకు పోతివా నాద ఒకదాన్ని ఒక్కదాన్ని ఒక్కదాన్నోయీ'.. జానపద స్టైల్ లో కూడిన ఈ సాంగ్ ఒన్ ఇయర్ బ్యాక్ రిలీజ్ అయ్యింది. రిలీజ్ రోజు నుంచే యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ ని రాబడుతు ప్రస్తుతం 47 మిలియన్ల వ్యూస్ దగ్గర ఉంది. దీన్ని బట్టి తెలంగాణ జానపద సాంగ్స్ కి ఉన్న క్రేజ్ ఏ పాటిదో అర్ధం చేసుకోవచ్చు. తెలంగాణ పల్లెల్లో ఉన్న ఎన్నో అచ్చ తెలుగు పదాల్ని తెలియచెప్పడం కూడా ఈ సాంగ్ స్టైల్.

also read:  Anupama Parameswaran: ప్రెగ్నెంట్‌గా అనుపమ పరమేశ్వరన్.. సైలెంట్‌గా ఓటీటీలోకి 

 ఈ సాంగ్ ని చాలా మంది డీజే రీమిక్స్ చేసారు. అవి కూడా రికార్డు వ్యూస్ తో దూసుకుపోతున్నాయి.  కాని సాంగ్ ని రాసిన జోగుల వెంకటేష్ కి ఎలాంటి రెమ్యునరేషన్ ని ఇవ్వలేదు. ఈ విషయాన్నీ స్వయంగా  తానే గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వెల్లడి చేసాడు.లావణ్య ఆలపించగా  జోగుల వెంకటేష్ , సౌజన్య అయాన్. మన్ప్రీత్ కౌర్ ముఖ్యమైన క్యారెక్టర్స్. సుమారు ఐదు లక్షలతో సాంగ్ ని రూపొందించారు.

 

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.