![]() |
![]() |

-హాట్ టాపిక్ గా మారిన తమ్మారెడ్డి వ్యాఖ్యలు
-ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు!
-దాసరి తర్వాత ఎవరైనా ఉన్నారా!
-ఇంక పెద్ద దిక్కు రానట్టేనా!
సుదీర్గ కాలం నుంచి తెలుగు సినిమా తన మనుగడ కొనసాగిస్తు కోట్లాది మంది ప్రేక్షకులని అలరిస్తూ వస్తుంది. సినిమా అలవాటు లేని వాళ్ళు సైతం అనుకోకుండా సినిమా చూస్తే ఇక సినిమా చూడటం అనేది తన నిత్య దినచర్యగా చేసుకుంటారు. ఈ విషయంలో తిండి, నిద్ర, కాలకృత్యాలు అనేవి తనకి ఎదురొచ్చినా డోంట్ కేర్ అనే నైజం. అంతటి బలమైన సాధనం సినిమా. మరి అలాంటి సినిమాని తెరకెక్కించే 24 క్రాఫ్ట్స్ లో ఒక్కోసారి సమస్యలు వస్తాయి. తద్వారా సినిమా కూడా సమస్యలు ఎదుర్కొంటుంది. అలాంటి సమయంలో ఇండస్ట్రీ పెద్దగా దర్శకరత్న దాసరి నారాయణరావు(Dasari Narayanarao)వ్యవహరించేవాడు. కానీ ఆయన తర్వాత పెద్ద దిక్కు ఎవరనే మాటలు తరచుగా వస్తూనే ఉన్నాయి. ఈ విషయంపై ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ (Tammareddy Bharadwaja)చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ గా నిలుస్తున్నాయి. ఆ మాటలేంటో చూద్దాం.
చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత తమ్మారెడ్డి 'వదలా'(vadhala)అనే మూవీతో మరోసారి నిర్మాతగా అడుగుపెడుతున్నాడు. నిన్న ఈ మూవీ నుంచి గ్లింప్స్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒక మీడియా ప్రతినిది తమ్మారెడ్డితో 'ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అని అడగటం జరిగింది. అందుకు తమ్మారెడ్డి మాట్లాడుతు 'ఇండస్ట్రీలో పదవులు ఉండవు. పెద్ద దిక్కు అనేది పదవి కాదు. ఎవరైనా సరే వాళ్లు చేసే పనులని బట్టి పెద్ద దిక్కు అవుతారు. అప్పట్లో దాసరి నారాయణరావు గారు తాను చేసే పనుల వల్ల పెద్ద దిక్కు అయ్యారు. దాంతో అందరం ఆయన దగ్గరకి వెళ్ళేవాళ్ళం. ఇవాళ ఆయన లేరు కాబట్టి, పెద్ద దిక్కు కూడా ఇంకెవరూ లేరు. నాకు తెలిసి అలాంటి వ్యక్తి రావడం కూడా జరగదని బదులిచ్చాడు. ఇప్పుడు ఈ మాటలు సినీ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి.
also read: UStaad Bhagat Singh: మహేష్ బాబు ఫ్యాన్స్ కి క్షమాపణలు.. ఉస్తాద్ భగత్ సింగ్ కి మద్దతు ఇస్తారా!
'వదలా'మూవీ చూసుకుంటే జగపతి బాబు(Jagapathibabu)లయ, హృతిక శ్రీనివాసన్ జత కడుతుండగా వంశీ కృష్ణ ఆకెళ్ల(Vamsikrishna akella)దర్శకుడు. కిషోర్ నాయుడు మరో నిర్మాత. గ్లింప్స్ అయితే ఆసక్తికరంగా ఉంది.
![]() |
![]() |