![]() |
![]() |

-మొన్న ఎంజిఆర్ పై నోరు జారిన రాజేంద్రప్రసాద్
-స్పందించిన విశాల్, నాజర్
-క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఇటీవల 'కళాప్రపూర్ణ కత్తి కాంతారావు'(kantharao)జాతీయ పురస్కారంని నటకిరీటి రాజేంద్రప్రసాద్(Rajendraprasad)అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతు జానపద చిత్రాల్లో కాంతారావు ప్రతిభని చూసి తమిళ గొప్ప నటుడు ఎంజిఆర్ ఉచ్చపోసుకునే వాడని మాట్లాడాడు. దీంతో తమిళ చిత్ర పరిశ్రమ నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందనే దిగులు తెలుగు సినిమా ప్రేమికుల్లో ఉంది.వాళ్ళు అనుకున్నట్టుగానే స్పందించడం స్టార్ట్ అయ్యింది. ఆ డీటెయిల్స్ చూద్దాం.
ప్రముఖ నటుడు విశాల్(Vishal)ఎక్స్ వేదికగా స్పందిస్తు 'డియర్ రాజేంద్రప్రసాద్ సర్, మీ మీద ఎంతో గౌరవం ఉంది. కానీ మీరు దివంగత లెజెండరీ నటుడు, వన్ అండ్ ఓన్లీ ఎంజిఆర్ గురించి చేసిన వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు, తమిళనాడుకి గొప్ప లీడర్. కాంతారావు గారిని పొగడాలనే ఉద్దేశంతో మీరు ఈ వ్యాఖ్యలు చేశారని అర్థమైంది. అయితే అదే సమయంలో ఎంజిఆర్ ని తక్కువగా, చులకనగా చేసి మాట్లాడిన అవసరం లేదు. ఆయన, మా ప్రజల గుండెల్లో చిరస్థాయిలో నిలిచిపోయా రు. అలాంటి నటుడి గురించి ఇలా మాట్లాడి, తమిళనాడు ప్రజల మనోభావాలని దెబ్బతీశారు. దయచేసి ముగింపు ఇస్తారని కోరుతున్నా. మిమ్మల్ని క్షమాపణలు చెప్పాలని కోరుతున్నందుకు నన్ను క్షమించండి, కానీ ఒక వేళ భవిష్యత్తులో నేను ఏదైనా నోరుజారి మాట్లాడితే, బహిరంగంగా క్షమాపణలు చెప్పడానికి వెనకాడనని తెలిపాడు. సదరు ట్వీట్ ని తెలుగు మూవీ అసోసియేషన్‌ని కూడా ట్యాగ్ చేశాడు.
also read: యూట్యూబ్ ని షేక్ చేస్తున్న తెలంగాణ సాంగ్.. కానీ డబ్బులు ఎంత వచ్చాయో తెలుసా!
సీనియర్ అండ్ లెజండ్రీ యాక్టర్ నాజర్(Naasar)కూడా రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలని ఖండిస్తు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసాడు. పలువురు నటులు, టెక్నీషయన్స్ నుంచి కూడా క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ ఊపందుకుంటుంది. విశాల్, నాజర్ ఎంటైర్ తమిళ చిత్ర పరిశ్రమ నటుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన నడిగర్ సంఘంకి ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీగా ఉన్నారు.
.webp)
![]() |
![]() |