![]() |
![]() |
.webp)
ఎన్నాళ్ళ కెన్నాళ్ళ కెన్నాళ్లకు వెన్నెల్లు తిరిగొచ్చే మా కళ్ళకు అనే పాటలా ఎట్టకేలకు బెల్లం కొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda sai Sreenivas)న్యూ మూవీ అప్ డేట్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)తో భీమ్లా నాయక్ ని తెరకెక్కించిన సాగర్ చంద్ర దర్శకుడు అయితే విక్టరీ వెంకటేష్ తో నమోవెంకటేశ, బాలకృష్ణ లెజండ్, రామ్ రెడీ, వరుణ్ తేజ్ వాల్మీకి లాంటి సినిమాలని నిర్మించిన ఫోర్ టీన్ రీల్స్ సంస్థ. కొన్ని రోజులుగా మూవీ గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. ఇప్పుడు రావడంతో తెలుగు సినిమాకి పండుగ వాతావరణం వచ్చినట్టయ్యింది.
టైసన్ నాయుడు(tyson naidu)టైటిల్ చూస్తుంటేనే థియేటర్స్ కి పరుగులు పెట్టేలా అనిపిస్తుంది కదు. బెల్లంకొండ హీరోగా వస్తున్న ఈ మూవీ చాలా రోజుల కిందటే షూటింగ్ ని ప్రారంభించుకుంది. జనవరి 3 బెల్లంకొండ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ గ్లింప్ రాగా అభిమానులు,ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం రాజస్థాన్ కోట లో ఒక కీలక షెడ్యూల్ ని జరుపుకుంటుంది. ఫైట్ మాస్టర్ స్టన్ శివ నేతృత్వంలో యాక్షన్ సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారు. రేపు థియేటర్స్ లో ఈ ఫైట్స్ పూనకాలు తెప్పించే విధంగా ఉంటాయని యూనిట్ విశ్వసిస్తుంది. రెండు వారాల పాటు కంటిన్యూగా జరిగే ఈ షెడ్యూల్‌లో యాక్షన్ సన్నివేశాలే కాకుండా టాకీ పార్ట్ కూడా చిత్రీకరించనున్నారు. మూవీకి సంబంధించిన మిగతా తారాగణం ఇందులో పాల్గొననుంది

బెల్లంకొండ సరసన ఇస్మార్ట్ భామ నబానటేష్ (naba natesh)జతకడుతుంది. ప్రొడ్యూసర్ రామ్ ఆచంట(Ram Achanta) బెల్లంకొండ సినీ కెరీర్ లోనే అత్యంత భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నాడు. బాక్సింగ్ లో కింగ్ అయిన టైసన్ పేరు మూవీకి ఎందుకు పెట్టారనేది అందరిలో ఆసక్తిగా మారింది. ప్రెజంట్ మంచి ఫామ్ లో ఉన్న భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందిస్తుండగా భారీ తారా గణమే మూవీలో మెరవనుంది
![]() |
![]() |