![]() |
![]() |

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram) ఇటీవల కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్ళాడు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ కాగా.. వాటిలో త్రివిక్రమ్ కుమారుడు రిషి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. రిషి చూడటానికి హీరోలా ఉన్నాడని, త్వరలోనే సినీ రంగ ప్రవేశం చేస్తాడేమో అనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇప్పుడు రిషికి సంబంధించి ఓ ఆసక్తికర న్యూస్ వినిపిస్తోంది.
త్రివిక్రమ్ కుమారుడు రిషి ఇప్పటికే సినీ పరిశ్రమలో పని చేస్తున్నాడట. నటుడిగా కాకుండా, తన తండ్రి బాటలోనే పయనిస్తూ దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడట. సితార ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి త్రివిక్రమ్ కి చెందిన నిర్మాణ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్.. చిత్రాలను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు బ్యానర్లు కలిసి విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమాని నిర్మిస్తున్నాయి. దీనికి 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకుడు. ప్రస్తుతం ఈ సినిమాకి గౌతమ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా రిషి వర్క్ చేస్తున్నాడట. మరి భవిష్యత్ లో దర్శకుడిగా తన తండ్రి స్థాయికి చేరుకుంటాడేమో చూడాలి.
![]() |
![]() |