![]() |
![]() |

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (pawan kalyan)ఇటీవల జరిగిన ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో ఘన విజయం సాధించాడు. కూటమి తరుపున పోటీ చేసిన తన జనసేన పార్టీ అభ్యర్థులందరని గెలిపించుకొని నూటికి నూరు శాతం ఫలితాలని సాధించాడు. ఈ సందర్భంగా తన పుట్టిల్లు అయిన సినిమా పరిశ్రమ నుంచి అభినందలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో అధికారంగా సినిమా రంగం నుంచి పవన్ కి సన్మాన సభ జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
పవన్ ఇప్పుడు పూర్తిరాజకీయ మనిషిగా మారాడు. ఉప ముఖ్యమంత్రి తో పాటు మొత్తం ఐదు శాఖలకి మంత్రిగా తన బాధ్యతలని నిర్వహించబోతున్నాడు. ఈ విజయానికి కారణం కళామాతల్లి అనేది అక్షర సత్యం. రెండున్నర దశాబ్డల నుంచి సిల్వర్ స్క్రీన్ మీద తనదైన పవర్ ప్యాకేజ్డ్ నటనతో ప్రేక్షకుల దృష్టిలో చిర స్థాయిగా నిలిచిపోయాడు. అందుకే ఎన్నికల్లో అంతటి విజయం దక్కింది. ఇక సినిమా బిడ్డ అయిన పవన్ ని సినిమా పరిశ్రమ సన్మానం ఏర్పాటు చేస్తుందా లేదా అనే చర్చ ఇప్పుడు అందరిలో మొదలయ్యింది.చాలా మంది సినీ ప్రముఖులు, అభిమానులు పవన్ ని సినిమా పరిశ్రమ సన్మానించడం సబబు అని అంటున్నారు. మరి ఇదే కనుక జరిగితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్న మంచు విష్ణు ఆధర్యంలో ఆ కార్యక్రమం జరగాలి. దీంతో అది సాధ్యమయ్యేదేనా అని అనుకుంటున్నారు.
ఎందుకంటే మంచు విష్ణు (manchu vishnu)ప్రస్తుత ఎన్నికల్లో దారుణ పరాజయాన్ని మూటగట్టుకున్న వైసిపీ కి అనుకూలంగా ఉంటాడనే ప్రచారం ఉంది. పైగా జగన్ మోహన్ రెడ్డి స్వయంగా విష్ణు కి బావ వరసవుతాడు. అదే విధంగా ఒకానొక సందర్భంలో పవన్ ని విష్ణు విమర్శించాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. కొంత మంది అయితే పవనే సినిమాని సన్మానిస్తాడేమో అంటున్నారు. ఎందుకంటే కృతజ్నతా భావానికి పవన్ నిలువెత్తు రూపంగా ఉంటాడు. పవర్ స్టార్ గా, పొలిటికల్ స్టార్ గా తనని తీర్చిదిద్దిన సినిమాకి సన్మానం చేయవచ్చనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. అదే జరిగితే అప్పుడు కూడా విష్ణు ఉండాల్సిందే.
![]() |
![]() |