![]() |
![]() |

నవదీప్, పంఖురి గిద్వానీ జంటగా నటించిన చిత్రం 'లవ్ మౌళి' (Love Mouli). అవనీంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అఘోరాగా అతిథి పాత్రలో రానా దగ్గుబాటి మెరిశాడు. కొన్నేళ్ల విరామం తరువాత నవదీప్ హీరోగా నటించిన ఈ చిత్రం.. మంచి అంచనాలతో జూన్ 7న థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలో అలరించనుంది.
'లవ్ మౌళి' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక ఆహా సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని తాజాగా ప్రకటించిన ఆహా.. త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు తెలిపింది. ఈ చిత్రం జూన్ 28 నుంచి ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

ఫాంటసీ టచ్ తో బ్యాటిఫుల్ లవ్ స్టోరీగా వచ్చిన 'లవ్ మౌళి' చిత్రానికి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. థియేటర్లలో అయితే మౌళి(నవదీప్), అఘోరా(రానా దగ్గుబాటి) మధ్య సన్నివేశాలకు మంచి స్పందన లభించింది. రానా గెటప్, స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఓటీటీలోనూ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందేమో చూడాలి.
![]() |
![]() |