![]() |
![]() |

కొంత మంది హీరోయిన్లకి ఎన్ని సినిమాలు చేసినా కూడా రాని గుర్తింపు కొంత మందికి మాత్రం ఒకే ఒక్క సినిమాతో వస్తుంది. గుర్తింపు రావడమే కాదు ఓవర్ నైట్ స్టార్ ని కూడా చేస్తుంది. ఇప్పుడలా యానిమల్ మూవీతో ఓవర్ నైట్ తో స్టార్ ఇమేజ్ పొందిన నటి త్రిప్తి డిమ్రి. యానిమల్ లో ఆమె పండించిన పెర్ఫార్మెన్సు కి ఇండియా మొత్తం ఫిదా అయ్యింది. తాజాగా ఆమె యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి.
త్రిప్తి డిమ్రి తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూ లో యాంకర్ అడిగిన అన్ని ప్రశ్నలకి ఎలాంటి ఆలోచనలు లేకుండా వెంట వెంటనే ఆన్సర్స్ చేసింది.ఈ క్రమంలో తెలుగులో మీకు ఎవరితో నటించాలని ఉందని యాంకర్ అడిగితే వెంటనే ఎన్టీఆర్ తో నటించాలని ఉందని సమాధానం చెప్పింది. ఇప్పుడు సోషల్ మీడియాలో త్రిప్తి ఇంటర్వ్యూ వీడియో సంచలనం సృష్టిస్తుంది. ఎన్టీఆర్ అభిమానులు అయితే మాత్రం త్రిప్తి ఎన్టీఆర్ నటించిన ఏ సినిమా చూసి ఉంటుందని అనుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసి ఉంటుందని కొంత మంది అభిమానులు అంటున్నారు
అలాగే ఎన్టీఆర్ త్రిప్తి కాంబినేషన్ లో సినిమా వస్తే సూపర్ గా ఉంటుందని కూడా ఫాన్స్ అంటున్నారు. యానిమల్ లో బోల్డ్ గా నటించి దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న త్రిప్తి ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండియన్ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ అయ్యాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
![]() |
![]() |