![]() |
![]() |

పవర్ స్టార్ 'పవన్ కళ్యాణ్'(Pawan Kalyan)'ఓజి'(OG)తో సిల్వర్ స్క్రీన్ పై మరోసారి అడుగుపెట్టే సమయం ఆసన్నమైంది. 'హరిహరవీరమల్లు' పెద్దగా ప్రభావం చూపించకపోవడంతో 'ఓజి' ఏ మేర ప్రభావం చూపిస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది. , పవన్ లుక్, ప్రచార చిత్రాలు, సాంగ్స్, ఒక రేంజ్ లో ఉండటంతో, ఫ్యాన్స్ అయితే 'ఓజి' సూపర్ హిట్ అనే నమ్మకంతో ఉన్నారు. గ్యాంగ్ స్టార్ డ్రామా అనే విషయం తెలుస్తున్నా, కథ ఏ విధంగా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలో ఏర్పడింది.
ఈ క్రమంలోనే రీసెంట్ గా 'ఓజి' భామ ప్రియాంక మోహన్(Priyanka Mohan)మాట్లాడుతు అందరు 'ఓజి' ని యాక్షన్ డ్రామాతో తెరకెక్కిందని అనుకుంటున్నారు. కానీ మూవీలో బలమైన ఫ్యామిలీ డ్రామా ఉంది. దాని చుట్టూనే యాక్షన్ ఒక భాగంగా ఉంటుంది. 1980 , 90 వ దశకంలో జరిగే కథ. పవన్ గారితో పాటు నా క్యారక్టర్ ని మలిచిన తీరు ఆ కాలానికి తగ్గట్టే ఉంటుంది. 'కన్మణి' అనే బలమైన నేను ఓజాస్ గంభీరతో ప్రేమలో పడతాను. దీంతో గంభీర జీవితం మలుపు తిరుగుతుంది. ఇదే కథకి కీలకం. ఇమ్రాన్ హష్మీ(Emraan Hashmi)పోషించిన విలన్ క్యారక్టర్ 'ఓమీ' తోను నాకు సన్నివేశాలు ఉన్నాయి. మరి ఈ కథలో సంఘర్షణకు, యాక్షన్ కి కారణం ఎవరన్నది మూవీ చూసి తెలుసుకోవాలని ప్రియాంక చెప్పుకొచ్చింది.
'బెంగుళూరు'కి చెందిన 'ప్రియాంక మోహన్', నాచురల్ స్టార్ 'నాని'(Nani)తో కలిసి 'గ్యాంగ్ లీడర్' ద్వారా తెలుగు సినీ పరిశ్రమకి ఎంట్రీ ఇచ్చింది. అనతి కాలంలోనే తన అందంతో పాటు, అంతకంటే అందమైన పెర్ఫార్మెన్స్ తో, ఎంతో మంది అభిమానులని సంపాదించుకుంది. పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోతో జోడి కట్టడం ఇదే తొలిసారి. దీంతో ఓజి తర్వాత ప్రియాంక మోహన్ కి మరికొంత మంది బడా హీరోలతో జత కట్టే, అవకాశాలు వస్తాయని, సినీ ట్రేడ్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఓజి వరల్డ్ వైడ్ గా సెప్టెంబర్ 25 న విడుదల కానున్న విషయం తెలిసిందే. సుజీత్(Sujeeth)దర్శకుడు కాగా దానయ్య(DVV Danayya)నిర్మాత.

![]() |
![]() |