![]() |
![]() |

బిచ్చగాడు తో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న హీరో విజయ్ ఆంథోనీ (vijay antony)ఇమేజ్ అనే పదానికి దూరంగా ఉంటూ డిఫరెంట్ కాసెప్ట్ తో కూడిన సినిమాలు చెయ్యడం ఆయన స్పెషాలిటీ. కిల్లర్, రోషగాడు, విజయ్ రాఘవన్, ఇంద్ర సేన, విక్రమ్ రాథోడ్, రోమియో, రాఘవన్, హత్య,లవ్ గురు వంటి చిత్రాలే అందుకు ఉదాహరణ. పైగా మంచి అభిరుచి ఉన్న నిర్మాత మరియు మ్యూజిక్ కంపోజర్ కూడాను. లేటెస్ట్ గా ఆయన చేస్తున్న కొత్త మూవీలోని పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ ని అందుకుంటుంది.
తుఫాన్ (toofan)..విజయ్ ఆంథోనీ నుంచి రాబోయ్ నెక్స్ట్ మూవీ ఇదే. విజయ్ మిల్టన్ (vijay miltan) దర్శకుడు. ఇంతకు ముందు విజయ్ తో రాఘవన్, హత్య సినిమాలని నిర్మించిన కమల్ బోరా, పంకజ్ బోరా, లలిత్ ప్రదీప్ లు నిర్మిస్తున్నారు. ఆ రెండు చిత్రాలు మంచి విజయాన్ని సాధించడంతో తుఫాన్ హ్యాట్రిక్ మూవీ గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ చిత్రం నుంచి వచ్చిన సెకండ్ సాంగ్ అందరి మనసులని హత్తుకుంటుంది. వెతికా నేనే నా జాడే నిలిచి దారిలో..నా ఒళ్లే వెతికే నేడు కొత్త పేరునే, నాకు నేనై తప్పి పోయా గాలై సాగుతూ..కాలం కరిగిపోయే తీరం చేరుతూ అనే అద్భుతమైన పల్లవి తో పాట స్టార్ట్ అయ్యింది. చరణాలు కూడా చాలా కొత్తగా ఉన్నాయి. విన్న వాళ్లందరూ పాట చాలా బాగుందని ఒక కొత్త ప్రపంచంలోకి తమని తీసుకెళ్లిందని అంటున్నారు. నిర్మాతలు కూడా సినిమా మొత్తానికే ఆ సాంగ్ హైలెట్ గా నిలుస్తుందని చెప్తున్నారు. హరి దపూషియా సంగీత సారథ్యంలో మాష్మి నేహా చాలా చక్కగా ఆలపించింది.

పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుండగా విజయ్ సరసన మేఘ ఆకాష్(Megha Akash)కధానాయికగా చేస్తుంది.షూటింగ్ కూడా చివరి దశకు చేరుకుంది, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక గత సెప్టెంబర్ లో విజయ్ అంథోని కూతురు మీరా ఆంథోనీ సూసైడ్ చేసుకున్న విషయం అందరకి తెలిసిందే. విజయ్ ఆ బాధని దిగమింగుకొని మరి ప్రేక్షకులని అలరించటానికి సినిమాలు చేస్తు వస్తున్నాడు.
![]() |
![]() |