![]() |
![]() |

ప్రస్తుతం 'దేవర' (Devara), 'వార్-2' (War 2) సినిమాలతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనున్న ఈ చిత్రానికి 'డ్రాగన్' (Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ ని 'యానిమల్' యాక్టర్ ఢీ కొట్టబోతున్నట్లు సమాచారం.
'డ్రాగన్'లో హీరోయిన్ గా రష్మిక మందన్నను ఎంపిక చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. ఇక తాజాగా విలన్ ని కూడా లాక్ చేసినట్లు న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విలన్ గా బాబీ డియోల్ ని ఎంపిక చేశారట. నార్త్ లో మంచి గుర్తింపు ఉన్న బాబీ డియోల్.. 'యానిమల్'తో సౌత్ ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఆ చిత్రంలో ఆయన నటనకు అందరూ ఫిదా అయ్యారు. అందుకే 'డ్రాగన్' లాంటి పాన్ ఇండియా సినిమాకి.. బాబీ డియోల్ అయితే కరెక్ట్ అని విలన్ గా ఆయనను ఎంపిక చేశారట. సెప్టెంబర్ లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముందని తెలుస్తోంది.
![]() |
![]() |