![]() |
![]() |
.webp)
క్రైమ్ థ్రిల్లర్స్ ఎక్కడున్నా వెతికి మరీ చూస్తుంటారు. అందులోను పోలీస్ ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్స్ కి యమక్రేజు. ఓటీటీలో ఇలాంటి మూవీలని చూడలేని వారు యూట్యూబ్ లో ఫ్రీగా అందుబాటులో ఉన్న మూవీలని చూస్తుంటారు. అలాంటి వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ గా నిలిచిన మూవీ ' విస్మయ '.
ఈ మూవీ చాలా తక్కువ పాత్రలతో సాగుతుంది. ఎక్కువ ఫైట్లు, ఎక్కువ పాటలు లేకుండా తక్కువ నిడివితో సాగే కథనం మూవీని ఆడియన్స్ చూడటానికి కారణం అవుతున్నాయి. కిషొర్ , ప్రియమణి, మయూరి క్యాటారి, నాన్న ప్రాకార, ప్రమోద్ శెట్టి, గిరిజ లోకేష్ తదితరులు నటించగా .. వినయ్ బాలాజీ ఈ సినిమాకి దర్శకుడిగా చేశాడు. అర్జున్ రామ్ అందించిన బిజిఎమ్ కొన్నిచోట్ల సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయి. మర్త్ మీడియా ఈ మూవీని నిర్మించింది. క్రైమ్ థ్రిల్ ని ఇస్తూనే మిస్టరీని ఛేదించే దిశగా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. అసలు మూవీ కథేంటంటే.. రాత్రిపూట ఓ ఇంట్లో అమ్మాయి ఒక్కతే ల్యాప్ టాప్ లో వర్క్ చేసుకుంటుంది. సడెన్ గా కరెంట్ పోవడంతో క్యాండిల్ పెట్టుకొని మరీ పనిచేసుకుంటుంది. ఇంతలో గదిలో నుండి వింత శబ్దాలు దాంతో ఆమెకు వణుకు మొదలవుతుంది. ఇక ఎవరా అని చూసుకుంటు వెళ్ళిన ఆమెపై ఎవరో దాడి చేస్తారు. ఆ తర్వాత విస్మయ అనే అమ్మాయి కార్ యాక్సిడెంట్ లో చనిపోతుంది. ఇక ఫోరెన్సిక్ టీమ్ కి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అశోక్ చెప్తాడు. మరోవైపు విస్మయ అనే అమ్మాయి తన ఫ్రెండ్ అని ఒకరోజు నుండి తను కనపడట్లేదని కంప్లైంట్ ఇవ్వడానికి ఆమె ఫ్రెండ్స్ వస్తారు. వారిదగ్గర వివరాలు తీసుకొని పంపించిన పోలీస్ అధికారి అశోక్ కి విశ్వనాథ్ అనే ఫోరెన్సిక్ డాక్టర్ కాల్ చేసి కొన్ని వివరాలు చెప్తాడు. ఇక వివరాలతో విస్మయ ఎలా చనిపోయిందనే మిస్టరీని ఛేదిస్తారు పోలీసులు. అయితే అశోక్ భార్య ఓ పెళ్ళికి బయల్దేరి వెళ్తుంది. ఇంతలో అక్కడ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఫైల్ లో ఉన్న విస్మయ ఫోటో చూసి షాక్ అవుతుంది.
తన పేరు విస్మయ అని ఆమె పెళ్ళికే మనం ఇప్పుడు వెళ్తున్నామని చెప్పగా అశోక్ షాక్ అవుతాడు. అయితే విస్మయ అనే అమ్మాయి నిజంగానే చనిపోయిందా? మొదట చనిపోయిన అమ్మాయి ఎవరు? విస్మయది హత్యా? యాక్సిడెంటా అనేది పోలీసులు కనిపెట్టారా లేదా అనేది మిగతా కథ. యూట్యూబ్ లో ఫ్రీగా ఉన్న సూపర్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ని చూసేయ్యండి. ఎక్కడ బోర్ కొట్టకుండా సాగే కథనం .. ట్విస్ట్ లు, ఒక్కో సీన్ కి వచ్చే ఇంటెన్స్ మూవీపై ఇంట్రస్ట్ ని కలిగిస్తుంది. యూట్యూబ్ లో క్రైమ్ థ్రిల్లర్స్ కోసం వెతికే మూవీ లవర్స్ తప్పకుండా చూడాల్సిన ఈ మూవీని చూసేయ్యండి.
![]() |
![]() |