Home  »  News  »  Tollywood Trending: టాలీవుడ్ ట్రెండింగ్ లో ఈరోజు హెడ్ లైన్స్ 

Updated : Apr 22, 2026


దేవతలు రోజు కనపడినా బోర్ కొట్టే పరిస్థితి. మనిషి మెదడు అలాంటిది మరి. కానీ సినిమా న్యూస్ మాత్రం సదరు మెదడుకి బోర్ కొట్టవు. ఇంకా ఇంకా కావాలంటుంది. సినీ న్యూస్ కి ఉన్న శక్తి అలాంటిది. మరి ఈ రోజు ఎలాంటి సినీ న్యూస్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయో చూద్దాం  

 

1. వెండి తెరపైకి చంద్రబాబు నాయుడు బయోపిక్

తెలుగు ప్రజల అభిమాన నాయకుడు, అభిమానుల ఆరాధ్య దైవం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయోపిక్ సెల్యులాయిడ్ పైకి అడుగుపెడుతుంటే ఆనందపడని తెలుగు వారు ఉంటారా.. ఉండనే ఉండరు. ఆ కట్ అవుట్ కి ఉన్న కెపాసిటీ అలాంటిది. చంద్ర బాబు బయోపిక్ కి ముహూర్తం సిద్దమయ్యింది. రాజధాని ఫైల్స్ ని తెరకెక్కించిన భాను దర్శకుడు. దీంతో మూవీ ఎప్పుడెప్పుడు కంప్లీట్ చేసుకొని తమ ముందుకొస్తుందా అని  అభిమానులు ఎదురుచూస్తూ ఉన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా  పాన్ వరల్డ్ చిత్రంగా అన్ని ప్రపంచభాషల్లోనూ  నిర్మించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

2. త్రిపురనేని చిట్టిబాబు మరణం

తెలుగు సినిమా పరిశ్రమలో విషాద సంఘటన చోటు చేసుకుంది..తన పాటల ద్వారా, రచనల ద్వారా ఎంతో మందిని ప్రభావితం చేసిన లెజెండ్రీ రైటర్ త్రిపురనేని మహారధి కుమారుడు త్రిపురనేని చిట్టిబాబు మరణించడం జరిగింది. నిన్న రాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్  హాస్పిటల్లో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచారు.అసలు పేరు వరప్రసాద్ కాగా చిట్టిబాబుగానే ప్రసిద్ధుడు. దర్శకుడిగా, నటుడిగా రాణించడంతో పాటు నిర్మాతగా అనేక చిత్రాలు నిర్మించారు. వయసు 70సంవత్సరాలు.

 3 . మెట్రో రైలులో సాయికుమార్ 

రీసెంట్ గా హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణికులకు ఒక మరుపురాని అనుభవం ఎదురైంది. సాధారణ ప్రయాణికులతో కలిసి సీనియర్ హీరో, 'డైలాగ్ కింగ్' సాయి కుమార్ మెట్రోలో ప్రయాణించి అందరినీ ఆశ్చర్యపరిచారు. మంగళవారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన 'SRH vs DC' ఐపీఎల్ మ్యాచ్‌ను వీక్షించేందుకే మెట్రోలో ప్రయాణించారు. తన మెట్రో ప్రయాణానికి సంబంధించిన ఫోటోలని సాయి కుమార్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.

4 . విజయం సాధించిన అల్లు అర్జున్ 
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం వేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. అల్లు అర్జున్   పేరు, ఫోటోలు, వాయిస్ లేదా ఆయనకు సంబంధించిన ఏవైనా ఐకానిక్ మేనరిజమ్స్‌ ని అనుమతి లేకుండా ఏఐతో సృష్టించడం లేదా వ్యాపార ప్రకటనలకు వాడటం అనేది నిషేధించారు


5 . బ్లడీ రోమియోకి బ్రేక్ నిజమేనా!

నాచురల్ స్టార్ నాని, సుజీత్ కాంబోలో బ్లడీ రోమియో తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ కి వెళ్ళడానికి మరింత సమయం పట్టేలా అవకాశం ఉందనే టాక్ సినీ బజార్ లో చక్కర్లు కొడుతుంది. ప్యారడైజ్ ని త్వరగా ఫినిష్ చెయ్యాలని నాని ఫిక్స్ అవ్వడమే కారణమని, దీంతో ఈ ఇయర్ బ్లడీ రోమియో థియేటర్స్ లోకి రాకపోవచ్చని టాక్ 

6 . చిరంజీవిని కలిసిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్  ఈ నెల 29 న పెళ్లి పీటలు ఎక్కనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తన సతీమణి కావ్య రెడ్డి,  తండ్రి, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మెగాస్టార్‌కు పెళ్లి ఆహ్వాన పత్రికతో పాటు ఒక ప్రత్యేకమైన వెడ్డింగ్ హాంపర్‌ను అందజేశారు. సాయి శ్రీనివాస్‌ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న చిరంజీవి, కాబోయే దంపతులకు తన ముందస్తు శుభాకాంక్షలు, ఆశీస్సులు అందజేశారు. మెగాస్టార్‌తో బెల్లంకొండ ఫ్యామిలీ దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


7 .అల్లు అర్జున్ లగ్జరీ ఇల్లు.. ధర వింటే షాక్ అవ్వాల్సిందే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో నిర్మిస్తున్న కొత్త హౌస్ ఇప్పుడు ఫిలిం నగర్‌లో చర్చనీయాంశమైంది. దాదాపు 4,000 చదరపు గజాల్లో 80 నుండి 100 కోట్ల బడ్జెట్ తో   ఈ ఇంటిని నిర్మిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది చివర్లో గృహప్రవేశం ఉండే అవకాశం ఉంది.

8 .పెద్దితో శృతి హాసన్ 

పెద్ది ఐటెం సాంగ్ లో ఏ హీరోయిన్ చేస్తుందనే చర్చ జరగని  రోజు సినీ సర్కిల్స్ ప్రశాంతంగా నిద్ర కూడా పోని పరిస్థితి. ఈ క్రమంలో రీసెంట్ గా శృతి హాసన్ చేయబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.  ఫ్యాన్స్ మాత్రం శృతి చేస్తే బాగుంటుందని తమ ఇష్ట దైవాలని వేడుకుంటున్నారు. ఎందుకంటే శృతి మోస్ట్ పవర్ గోల్డెన్ లెగ్. 

9. చిరు, బాబీ మూవీలో డింపుల్ హయతి 

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబోలో తెరకెక్కుతున్న మెగా 158 క్యాస్టింగ్ కి సంబంధించిన పనుల్లో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పుడు ఈ మూవీలో డింపుల్ హయతి చేయబోతుందనే న్యూస్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల రవితేజ తో భర్త మహాశయులకు విజ్ఞప్తి చేసి మెప్పించిన డింపుల్ మెగా 158 లో నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించబోతుందనేది టాక్ 

10 . కార్తికేయ 2 , తండేల్ డైరెక్టర్ క్రేజీ ప్రాజెక్ట్ 

 తండేల్ తో యువసామ్రాట్ నాగ చైతన్య ని ప్లాప్ ల నుంచి విముక్తుడ్ని చేసిన దర్శకుడు  చందు మొండేటి. తన నెక్స్ట్ మూవీ అప్ డేట్ కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో అక్షయ్ కుమార్, రానా దగ్గుబాటి తో ఒక క్రేజీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడని, ఉత్తరప్రదేశ్ లోని పురాతన నగరం ఉజ్జయిని నేపథ్యంలో కథ ఉండబోతునట్టుగా తెలుస్తుంది.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.