![]() |
![]() |

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan), టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్‌లో రాబోతున్న క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రారంభమైంది. ముంబైలో నిర్వహించిన గ్రాండ్ పూజా కార్యక్రమంతో ఈ సినిమా షూటింగ్ అట్టహాసంగా మొదలైంది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌ను ప్రస్తుతం ముంబైలోని కీలక ప్రాంతాల్లో చిత్రీకరిస్తున్నారు. సల్మాన్ ఖాన్ మార్క్ మాస్ ఎలిమెంట్స్‌కు వంశీ పైడిపల్లి స్టైలిష్ టేకింగ్ తోడైతే బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాలో 'లేడీ సూపర్ స్టార్' నయనతార హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం.
శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju), శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్‌లో వస్తున్న 63వ సినిమా (#SVC63) కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్‌తో, హై వోల్టేజ్ ఎంటర్టైనర్‌గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
సినిమా ప్రారంభోత్సవం సందర్భంగా విడుదల చేసిన చిన్న టీజర్ గ్లింప్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సల్మాన్ ఖాన్ తనదైన స్టైల్‌లో "స్వాగత్ నహీ కరోగే ఆప్ హమారా" అని అంటున్న డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వంశీ పైడిపల్లి గతంలో దిల్ రాజు నిర్మాణంలో 'మహర్షి', 'వారిసు' వంటి హిట్ చిత్రాలను అందించారు. ఇప్పుడు నేరుగా బాలీవుడ్ స్టార్‌తో సినిమా చేస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ ఇండియా వైడ్ హాట్ టాపిక్ గా మారింది.
https://x.com/SVC_official/status/2046870612963127692
![]() |
![]() |