![]() |
![]() |

సహజనటి జయసుధ పెద్ద కుమారుడు నిహార్ కపూర్ విలన్‌గా వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. లక్ష్ చదలవాడ హీరోగా నటిస్తోన్న చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. ఇషాన్ సూర్య డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ బ్యానర్‌పై చదలవాడ పద్మావతి నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 7 (మంగళవారం) నిహార్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'లో అతని లుక్‌ను రిలీజ్ చేశారు.
పొడవుగా పెంచిన గడ్డం, చేతిలో కొడవలితో ఒక స్టూల్ మీద కూర్చొని కోపంగా చూస్తున్న నిహార్ లుక్ చూస్తుంటే, అతను ఈ మూవీలో శక్తిమంతమైన పాత్రను పోషిస్తున్నట్లు అర్థమవుతోంది. హీరో లక్ష్‌ను ఢీకొట్టే పాత్ర ద్వారా నిర్మాతలు అతడిని వెండితెరకు పరిచయం చేస్తున్నారు. నిహార్ మెడలో, ఎడమ చేతికి రుద్రాక్ష దండలు కనిపిస్తున్నాయి. ఈ మూవీతో అతను ఆడియెన్స్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి.
అదివరకు ఆగస్ట్ 24న లక్ష్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. సీరియస్‌గా చూస్తున్న పహిల్వాన్స్.. వారి మధ్యలో కూల్‌గా... స్టైల్‌గా కొబ్బరి బోండాం తాగుతూ కూర్చొనివున్న హీరో లక్ష్ ఆకట్టుకున్నాడు. తన పాత్ర కోసం ఆయన బాగా మేకోవర్ అయ్యారనేది తెలుస్తుంది. ఈ మూవీలో హీరో పాత్ర సరికొత్త డైమన్షన్‌లో ఉంటుందని లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది.
సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రంలోని తొలి పాటను వినాయక చవితి సందర్భంగా 10వ తేదీ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
![]() |
![]() |