![]() |
![]() |

'ఓజీ'తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రికార్డుల వేట మొదలైంది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. విడుదలకు మూడు వారాల ముందే.. పవర్ స్టార్ తమ బాక్సాఫీస్ పవర్ ఏంటో చూపిస్తున్నారు. ఆకలితో ఉన్న చిరుతపులిలా రికార్డులను వేటాడుతున్నారు. (Pawan Kalyan)
నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద ఓజీ మూవీ సంచలనాలు సృషిస్తోంది. ప్రీమియర్ ప్రీ సేల్స్‌లో 1 మిలియన్ డాలర్ మార్క్ ను అందుకుంది. అంతేకాదు, ఈ ఘనతను అత్యంత వేగంగా సాధించిన చిత్రంగా నిలిచింది. (They Call Him OG)
పవన్ కళ్యాణ్ స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. తన అసాధారణ క్రేజ్ తో ఎన్నో రికార్డులను ఖాతాలో వేసుకున్నారు. అయితే కొన్నేళ్లుగా ఆయన స్టార్ డమ్ కి తగ్గ సరైన సినిమా రాలేదనే చెప్పాలి. ఇప్పుడు ఆ లోటుని తీర్చేలా ఓజీ వస్తోంది. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాకుండా.. సాధారణ ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలకు ముందే ఓజీ సరికొత్త రికార్డులకు సృష్టిస్తోంది.
ఓజాస్ గంభీరగా పవన్ కళ్యాణ్ కనువిందు చేయనున్న ఈ గ్యాంగ్ స్టర్ మూవీకి సుజీత్ దర్శకుడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక అరుళ్ మోహన్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇప్పటిదాకా ఓజీ నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ అభిమానులను ఆకట్టుకుంది. త్వరలోనే ట్రైలర్ విడుదల కానుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశముంది అంటున్నారు.
![]() |
![]() |