![]() |
![]() |
ఇటీవలికాలంలో తన అందంతో, అభినయంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న హీరోయిన్లలో మీనాక్షి చౌదరి ఒకరు. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అంత పెద్ద హిట్ సినిమాల్లో నటించినా ఈ ఏడాది ఒక్క సినిమాలో కూడా ఆమెకు అవకాశం రాలేదు. దీంతో ఇక మీనాక్షి పని అయిపోయిందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపించాయి. అలా కామెంట్స్ వినిపిస్తున్న క్రమంలోనే మీనాక్షికి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అది కూడా బాలీవుడ్ సినిమాలో. దీంతో మీనాక్షి ఆనందానికి అవధుల్లేవు.
2011లో జాన్ అబ్రహం హీరోగా వచ్చిన ‘ఫోర్స్’ చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత 2016లో వచ్చిన ‘ఫోర్స్2’ కూడా విజయం సాధించింది. ఇప్పుడు ‘ఫోర్స్3’ని తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేస్తున్నారు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. కెరీర్ ప్రారంభంలో అప్‌స్టేర్స్ అనే హిందీ సినిమాలో ఊరూపేరులేని క్యారెక్టర్ చేసింది. దాంతో తనకు తెలుగు చిత్ర పరిశ్రమ కరెక్ట్ అని భావించి టాలీవుడ్‌లో ప్రయత్నాలు ప్రారంభించి సక్సెస్‌ఫుల్ హీరోయిన్ అనిపించుకుంది. ఇప్పుడు బాలీవుడ్‌లోకి ఎంటర్ అవుతున్న మీనాక్షి.. ఫోర్స్3 రిజల్ట్‌ని బట్టి బాలీవుడ్‌లోనే ఉండిపోవాలా లేక తిరిగి టాలీవుడ్ రావాలా అనే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం.
![]() |
![]() |