![]() |
![]() |

నాగచైతన్య, సాయిపల్లవి జంటగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందిన సినిమా తండేల్. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించారు. ఫిబ్రవరి 7 థియేటర్లలో అడుగుపెట్టిన ఈ సినిమా.. చైతన్య కెరీర్ లో రూ.100 కోట్ల క్లబ్ లో చేరిన మొదటి సినిమాగా నిలిచింది. ఇప్పటికీ విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శితమవుతోంది. ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్నట్లు తెలుస్తోంది. (Thandel)
తండేల్ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేలా అగ్రిమెంట్ జరిగినట్లు సమాచారం. తండేల్ మూవీ మార్చి 7 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది అంటున్నారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి రానుందని వినికిడి.
మరి తండేల్ సినిమా నిజంగానే మార్చి 7న ఓటీటీలో అడుగు పెడుతుందో లేక థియేటర్లలో వస్తున్న రెస్పాన్స్ ని బట్టి మళ్ళీ డేట్ వెనక్కి వెళ్తుందో చూడాలి.
![]() |
![]() |