![]() |
![]() |

ఒకప్పుడు డైరెక్టర్ పూరి జగన్నాథ్ (Puri Jagannadh) అంటే టాలీవుడ్ లో ఒక బ్రాండ్. అప్పట్లో పూరితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు సైతం పోటీ పడేవారు. అలాంటి పూరి.. కొన్నేళ్లుగా వెనుకబడిపోయాడు. 2015 లో వచ్చిన 'టెంపర్' తర్వాత.. మళ్ళీ నాలుగేళ్లకు 2019 లో 'ఇస్మార్ట్ శంకర్'తో సక్సెస్ చూశాడు పూరి. మధ్యలో ఆయన డైరెక్ట్ చేసిన ఆరు సినిమాలు నిరాశపరిచాయి. అలాగే 'ఇస్మార్ట్ శంకర్' కూడా మంచి వసూళ్లతో బ్లాక్ బస్టర్ అనిపించుకున్నప్పటికీ.. పూరి ఫ్యాన్స్ ని మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తి పరచలేకపోయింది. అది పూరి మార్క్ సినిమా కాదని ఫ్యాన్స్ అభిప్రాయపడ్డారు. ఆయన గత చిత్రాలు 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' కూడా దారుణంగా నిరాశపరిచాయి. ఈ క్రమంలో పూరి తదుపరి సినిమా ఏ హీరోతో చేస్తాడనే ఆసక్తి నెలకొంది.
పూరి జగన్నాథ్ తన నెక్స్ట్ మూవీని గోపీచంద్(Gopichand)తో చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతంలో వీరి కాంబినేషన్ లో 'గోలీమార్' అనే మూవీ వచ్చింది. 2010 లో విడుదలైన ఈ యాక్షన్ క్రైమ్ ఫిల్మ్.. మంచి విజయం సాధించింది. గంగారామ్ గా గోపీచంద్ ను పూరి చూపించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 15 ఏళ్ళ తర్వాత మళ్ళీ పూరి-గోపీచంద్ చేతులు కలపబోతున్నట్లు సమాచారం. అది కూడా గోలీమార్ సీక్వెల్ కోసమని టాక్.
గోలీమార్ సినిమాకి ఎందరో అభిమానులు ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమాలోని కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. అలాంటి గోలీమార్ సీక్వెల్ తో పూరి కమ్ బ్యాక్ ఇస్తాడేమో చూడాలి. పైగా గోపీచంద్ కూడా కొన్నేళ్లుగా ఫ్లాప్స్ లో ఉన్నాడు. ఒక సాలిడ్ సక్సెస్ కోసం ఆయన కూడా ఎదురుచూస్తున్నాడు. ఈ లెక్కన పూరితో పాటు గోపీచంద్ కి కూడా.. గోలీమార్ సీక్వెల్ కమ్ బ్యాక్ ఫిల్మ్ అవుతుందేమో చూద్దాం.
![]() |
![]() |